Breaking News

Maharashtra: ఎన్సీపీ అభ్యర్థి నవాబ్‌ మాలిక్‌పై బీజేపీ మండిపాటు

Published on Wed, 10/30/2024 - 11:12

ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం ముగిసింది. మహాయుతి, మహా వికాస్‌ అఘాడీ కూటమిల నుంచి కీలక నేతలంతా బరిలోకి దిగుతున్నారు. తాజాగా డిప్యూటీ సీఎం అజిత్‌ పవార్‌ వర్గానికి చెందిన కీలక నేతల్లో ఒకరైన నవాబ్‌ మాలిక్‌ అభ్యర్థిత్వంపై బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పించారు. వచ్చే ఎన్నికలకు మన్‌ఖుర్ద్‌ శివాజీ నగర​ స్థానానికి ఆఖరి నిమిషంలో ఆయన రెండు నామినేషన్‌లు దాఖలు చేశారు. 

ఒకటి ఇండిపెండెంట్‌గా, మరొకటి ఎన్సీపీ సభ్యుడిగా చేశారు. చివరికి ఎన్సీపీ అభ్యర్థిగా అధికారికంగా ప్రకటించడంతో పార్టీ నుంచే పోటీలోకి దిగుతున్నారు. కాగా మాలిక్‌ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం, అతని సహచరులు ఛోటా షకీల్, టైగర్ మెమన్‌లకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నిందితుడిగా ఉన్నారు. ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు.

తాజాగా నవాబ్‌ మాలిక్‌ రెండు నామినేషన్లు వేయడంపై మహారాష్ట్ర బీజేపీ చీఫ్‌ అశిష్‌ షెలార్‌ మాట్లాడుతూ.. కూటమిలోని అన్నిపార్టీలు తమ సొంత అభ్యర్థిని నిర్ణయించుకోవాలని పేర్కొన్నారు. దీనిపై బీజేపీ వైఖరి చాలా స్పష్టంగా ఉందని తెలిపారు. 

‘ఎన్సీపీకి సంబంధించి నవాబ్ మాలిక్ అధికారిక అభ్యర్థిత్వానికి సంబంధించే ఇక్కడ సమస్య. బీజేపీ వైఖరిని దేవేంద్ర ఫడ్నవీస్ పార్టీ  పదే పదే స్పష్టం చేశారు, నేను మళ్ళీ చెబుతున్నాను. నవాబ్ మాలిక్ కోసం బీజేపీ ప్రచారం చేయదు. మేము అతని కోసం ప్రచారం చేసే ప్రశ్నే లేదు. ఎందుకంటే దావూద్ సంబంధిత కేసులతో సంబంధం ఉన్న ఎవరికీ మేము ప్రచారం చేయము’. అని పేర్కొన్నారు.

వాస్తవానికి నవాబ్‌ మాలిక్‌ అనుశక్తి నగర్‌ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ ఈసారి ఆ సీటు తన కుమార్తె సనా మాలిక్‌కు న్సీపీ కేటాయించింది. దీంతో నవాబ్‌ మాలిక్‌ మరోస్థానం నుంచి పోటీ చేసేందుకు సిద్దమయ్యారు. అయితే నవాబ్‌ మాలిక్‌కు నామినేషన్‌ ఇవ్వవద్దని అజిత్‌ పవార్‌పై బీజేపీ ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)