రేపు తెలంగాణకు అమిత్‌ షా: రామచందర్‌ రావు

Published on Thu, 09/04/2025 - 13:43

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా రేపు(శుక్రవారం) తెలంగాణలో పర్యటిస్తున్నట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు తెలిపారు. గణేష్ నిమజ్జన కార్యక్రమంలో అమిత్ షా పాల్గొంటారు అని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో కవితలాంటి అవినీతి పరులకు బీజేపీలో స్థానం లేదు అని ఘాటు విమర్శలు చేశారు.

బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘వన్ నేషన్.. వన్ ఎలక్షన్,  వన్ నేషన్.. వన్ లా, వన్ నేషన్.. వన్ ట్యాక్స్ నినాదంతో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుంది. పన్ను వ్యవస్థను సరళీకరణ చేయడం హర్షణీయం. మధ్యతరగతి కుటుంబాలకు మేలు చేకూరేలా మోదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జీఎస్టీ పన్నుల భారం తగ్గింపు నేపథ్యంలో రేపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాని మోదీకి పాలాభిషేకం చేస్తున్నాం. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రేపు తెలంగాణలో పర్యటించనున్నారు. అమిత్ షాను టీబీజేపీ నేతలు కలుస్తారు.. ఈ సమావేశంపై కొద్దిసేపట్లో క్లారిటీ వస్తుంది. గణేష్ నిమజ్జన కార్యక్రమంలో అమిత్ షా పాల్గొంటారు అని చెప్పుకొచ్చారు.

ఇదే సమయంలో తెలంగాణ బీఆర్‌ఎస్‌ రాజకీయాలు, కవిత ఎపిసోడ్‌పై రామచందర్‌ రావు స్పందిస్తూ..‘కవిత విషయంపై మాట్లాడాల్సిన అవసరం లేదు. యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం యూరియా సరఫరాలో ఎటువంటి లోపం లేదు’ అని వ్యాఖ్యలు చేశారు. 

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)