Breaking News

మహారాష్ట్రలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు బీజేపీ ఓపెన్‌ ఆఫర్!

Published on Wed, 11/27/2024 - 17:53

ముంబై: మహారాష్ట్రలో ముఖ్యమంత్రి పదవిపై ఉత్కంఠ నెలకొంది. మహాయతి కూటమిలో సీఎం ఎవరు అనేది ఢిల్లీ బీజేపీ పెద్దల చేతిలోకి వెళ్లింది. మరోవైపు.. మహాయుతి కూటమి భారీ విజయం నేపథ్యంలో బీజేపీ నేతలు కాంగ్రెస్ పార్టీ నాయకులను టార్గెట్ చేస్తున్నారు. హస్తం పార్టీలో గెలిచిన నేతలు బీజేపీలో చేరాలని తాజాగా  కాషాయ పార్టీ నేత మాట్లాడటం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.

మహారాష్ట్ర బీజేపీ నేత ఆశిశ్ దేశ్ ముఖ్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో బీజేపీ కూటమి భారీ మెజార్టీతో విజయం సాధించింది. కాంగ్రెస్ కూటమిని ప్రజలు తిరస్కరించారు. వారి ఓటమిని ప్రజలే శాసించారు. గతంతో పోలిస్తే మహారాష్ట్రలో కాంగ్రెస్ మరింత బలహీనపడింది. హస్తం పార్టీకి మరిన్ని ఓట్లు తగ్గాయి. ఆ పార్టీకి భవిష్యత్ లేదు. ఇంత జరుగుతున్నా ఇంకా అదే పార్టీలో ఉంటే కాంగ్రెస్ నేతల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మిగులుతుంది. అందుకే కాంగ్రెస్ నేతలు ఇప్పటికైనా బీజేపీలో చేరాలి. ఎన్నికల్లో గెలిచిన 16 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరండి అని సూచించారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా హాట్ టాపిక్ అయ్యాయి.

ఇదిలా ఉండగా.. ఆశిశ్ దేశ్ ముఖ్ మాజీ కాంగ్రెస్ నేత. పలు కారణాలతో ఆయనను కాంగ్రెస్ పార్టీ గతేడాది పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. దీంతో, ఆయన బీజేపీలో చేరారు. ఈ క్రమంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున ఆశిశ్ బరిలోకి దిగారు. నాగాపూర్ లోని సావ్నర్ స్థానంలో విజయం సాధించారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరాలని ఆయన పిలుపునిచ్చారు.

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)