రేవంత్‌కు ఝలక్‌.. బీఆర్‌ఎస్‌ బాటలోనే బీజేపీ!

Published on Sat, 03/08/2025 - 11:19

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎంపీల అఖిలపక్ష సమావేశానికి బీజేపీ సభ్యులు హాజరుకాకూడదని పార్టీ నేతలు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి లేఖ రాశారు. మరోవైపు.. ఈ సమావేశానికి బీఆర్‌ఎస్‌ కూడా దూరంగా ఉంది. నలుగురు రాజ్యసభ ఎంపీలు ఈ సమావేశంలో పాల్గొనడం లేదు.

ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి లేఖలో.. పార్టీ కార్యక్రమాల కారణంగా సమావేశానికి హాజరు కాలేకపోతున్నాం. భవిష్యత్‌లో ఇలాంటి సమావేశాలు నిర్వహిస్తే ముందుగానే తెలియజేయాలని కోరుతున్నాను. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది అంటూ చెప్పుకొచ్చింది.

ఇదిలా ఉండగా.. కేంద్ర ప్రభుత్వం వద్ద తెలంగాణకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి అన్ని పార్టీల ఎంపీలతో సమావేశం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యే ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షత వహించనున్నారు. ప్రజాభవన్‌లో శనివారం ఈ సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి రావాలని కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లతోపాటు రాష్ట్రానికి సంబంధించిన ఎంపీలందరికీ శుక్రవారం భట్టి విక్రమార్క ఫోన్‌ చేసి ఆహ్వానించారు.

Videos

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)