Breaking News

TN: అన్నాడీఎంకే బహిష్కృత నేతలతో బీజేపీ పొత్తు

Published on Wed, 03/13/2024 - 10:57

చెన్నై: లోక్‌సభ ఎన్నికల వేళ తమిళనాడులో రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. అధికార డీఎంకే ప్రధాన ప్రత్యర్థి అన్నాడీఎంకే బహిషృత నేలను బీజేపీ దగ్గరకు తీస్తోంది. ఈ క్రమంలోనే  ఎఎమ్‌ఎమ్‌కే చీఫ్‌ టీటీవీ దినకరన్‌, మాజీ సీఎం పన్నీర్‌ సెల్వంలతో బీజేపీ అగ్రనేతలు సీట్‌షేరింగ్‌ చర్చలు జరిపారు. ఈ చర్చల్లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కూడా పాల్గొన్నారు.

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి బేషరతు మద్దతిస్తున్నట్లు టీటీవీ దినకరన్‌ ఇప్పటికే స్పష్టం చేశారు. తాము దరఖాస్తు చేసిన ప్రెషర్‌ కుక్కర్‌ గుర్తు రాకపోతే కమలం గుర్తుపై పోటీ చేసేందుకు కూడా అభ్యంతరం లేదని దినకరన్‌ తెలిపారు. గతంలో టీటీవీ దినకరన్‌ రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేశారు. ఈయన గతంలో ఏఐడీఎంకే అగ్ర నేతగా వ్యవహరించిన శశికలకు మేనల్లుడు. ఇక పన్నీర్‌ సెల్వంతో బీజేపీ సీట్‌షేరింగ్‌ చర్చలు ఇంకా కొలిక్కిరాలేదు.    

మరోపక్క అధికార డీఎంకే, కాంగ్రెస్‌, కమలహాసన్‌ పార్టీ, వైకో తదతరులు కలిసి ఇండియా కూటమి గొడుగు కింద లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. అయితే ఈ ఎన్నికల్లో తమిళనాడులో డీఎంకే కూటమికి అన్నామలై సారథ్యంలోని బీజేపీ గట్టిపోటీ ఇవ్వనుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇటీవల పీఎం మోదీ నిర్వహించిన సభలకు కూడా ఇక్కడ మంచి స్పందన రావడంతో ఈ వాదనకు బలం  చేకూరుతోంది. ఈ ఎన్నికల రేసులో బీజేపీ కంటే ప్రతిపక్ష అన్నాడీఎంకే వెనుకబడిందనే వాదన వినిపిస్తోంది.

ఇదీ చదవండి.. అమిత్‌షా ఎంట్రీతో మహాకూటమి పంచాయతీ కొలిక్కి

Videos

బాబు ఒక్కసారి.. ఈ బామ్మ... ఈ వీడియో చూడు

టీడీపీ గూండాల దాష్టికం

హీరో తేజ సజ్జా పెళ్లి ఫిక్స్... అమ్మాయి ఎవరంటే?

స్టీల్ ప్లాంట్ బాధితులకు మాటిస్తున్నా... వరుదు కళ్యాణి కీలక వ్యాఖ్యలు

విడుదల రజినిని కిందకు తోసేస్తారా... అనితపై బండి పుణ్యశీల ఫైర్!

జనసేనకు డిపాజిట్లు రావొద్దు.. మంత్రి నారాయణ ఆడియో లీక్!

ఓటు తొలగింపు అంటే పౌరులను తొలగించడమే.. SIRపై సంచలన వ్యాఖ్యలు

Alert: ముంచుకొస్తున్న అర్జబ్ తూఫాన్

జగ్గయ్యపేటలో YSRCP ప్రచార జోరు..

షర్మిళకు YS జగన్ రాసిన లేఖను రిలీజ్ చేసి... చంద్రబాబుకు దిమ్మతిరిగే కౌంటర్

Photos

+5

యాంకర్‌ సుమ ఈవెంట్‌కి చీఫ్‌ గెస్ట్‌గా మెగా కోడలు (ఫోటోలు)

+5

'రోమియో జూలియట్' సారీ బేబీ పాట విడుదల (ఫొటోలు)

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)