Breaking News

‘రాహుల్‌ జీ.. నేనూ మీలాగే పెళ్లి చేసుకోను’

Published on Sat, 06/07/2025 - 20:16

పాట్నా: రాహుల్‌జీ రాజకీయాల్లో మీరే మాకు స్పూర్తి. నేను మీలాగే వివాహం చేసుకోకూడదనుకుంటున్నా. సమాజసేవ చేస్తా’ అంటూ ఓ యువతి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)ల మధ్య జరిగిన సంభాషణ వైరల్‌గా మారింది

ఈ ఏడాది సెప్టెంబర్‌ తర్వాత జరగనున్న బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో  విజయమే లక్ష్యంగా రాహుల్‌ గాంధీ  ప్రచారాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా శనివారం బీహార్ రాష్ట్రం గ‌యాలో ప‌ర్య‌టించారు. ప‌ర్య‌ట‌న‌లో మ‌హిళ‌లు సైతం రాజ‌కీయాల్లో ప్ర‌వేశించేలా కాంగ్రెస్ మ‌హిళా సంవాద్ అనే కార్య‌క్రమాన్ని త‌ల‌పెట్టింది. ఆ కార్య‌క్ర‌మంలో రాహుల్ గాంధీ.. మ‌హిళ‌ల‌తో రాజ‌కీయాల‌తో పాటు ప‌లు అంశాల‌పై చ‌ర్చించారు.  

ఈ సంద‌ర్భంగా బీహార్‌లో పాడ్ గ‌ర్ల్‌గా సుప‌రిచితురాలైన ‘రియా పాశ్వాన్’ రాహుల్‌తో మాట్లాడారు.  ప్రత్యేకంగా మహిళలు  విద్యా రంగం తరహాలో ఇతర రంగాల్లోకి ప్రవేశించడం లేదు. మ‌హిళ‌ల ర‌క్ష‌ణ కోసం కాంగ్రెస్ చేప‌ట్టిన శ‌క్తి అభియాన్ కార్య‌క్ర‌మంలో భాగంగా మేం బృందాన్ని ఏర్పాటు చేసుకున్నాం. త‌ద్వారా  ప్రజల సమస్యలను పరిష్కరించడానికి మేము ప్రయత్నిస్తున్నాం.  ప్రజలకు ఏదైనా సమస్య ఉంటే, ఆ స‌మ‌స్య ప‌రిష్కారం కోసం మా వద్దకు వ‌చ్చేలా తీర్చిదిద్దాం అని తెలిపారు.
 

 

అయితే, ఆమె ప్రసంగం ఆకట్టుకోవడంపై రాహుల్ స్పందించారు. మీ ప్రసంగం బాగుంది అంటూ రియా పాశ్వాన్‌పై ప్రశంసలు కురిపించారు. అందుకు రియా పాశ్వాన్ స్పందించింది. మీలా నేనూ పెళ్లి చేసుకోకూడదని అనుకుంటున్నాను. ప్రజా సేవ చేయాలని చెప్పడంతో స‌భ‌లో న‌వ్వులు కురిశాయి. నాయకురాలిగా మారాలని, ప్రజల కోసం పని చేయాలని ఉంది. రాజకీయాల్లోకి రావాలని ఉంది. శక్తి అభియాన్‌లో భాగమయ్యాక రాజకీయాలు అంటే ఏమిటో నాకు అర్థమైంది’ అని వ్యాఖ్యానించారు.

పాడ్‌ గర్ల్‌ రియా పాశ్వాన్‌ 
దీంతో ఆ బీహార్‌ పాడ్‌ గర్ల్‌ రియా పాశ్వాన్‌ ఎవరనేది చర్చాంశనీయంగా మారింది. ఎందుకంటే? ఈ పాడ్‌ గర్ల్‌ 2022లో ఓ సెన్సేషన్‌.  2022లో బీహార్‌ (Bihar) రాజధాని పాట్నాలో విద్యార్ధిని రియా పాశ్వాన్‌  ఐఏఎస్ అధికారిణి హర్జోత్ కౌర్ భమ్రాల మధ్య జరిగిన సంభాషణ నాడు దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది.  

రియా పాశ్వాన్‌ వర్సెస్‌ కలెక్టర్‌ హర్‌జోత్‌ కౌర్‌ భామ్రా
బీహార్‌ ఉమెన్‌ అండ్‌ చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కమ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ హర్‌జోత్‌ కౌర్‌ భామ్రా ఆ సమయంలో విమర్శలు ఎదుర్కొన్నారు. ప్రభుత్వం ఎన్నో ఉచితాలను అందజేస్తోంది. అలాంటిది 20-30రూ. ఉండే శానిటరీ పాడ్స్‌ ఉచితంగా ఇవ్వలేదా? అని రియా పాశ్వాన్‌  ప్రశ్నించింది. దానికి హర్‌జోత్‌ బదులిస్తూ.. ‘‘రేపు ప్రభుత్వం ఉచితంగా జీన్‌ ప్యాంట్స్‌ పంచాలని మీరు అడుగుతారు. ఆ తర్వాత అందమైన షూస్‌ కావాలని అడుగుతారు. అంతెందుకు ఫ్యామిలీ ఫ్లానింగ్‌ పద్దతుల్లో ఒకటైన కండోమ్‌లు పంచమని కూడా అడుగుతారు’’ అంటూ ఆమె పేర్కొన్నారు.

 

నేను భారతీయురాలిని. నేనెందుకు అలా చేస్తా 
ఆ వెంటనే.. ఓట్లేసి ప్రభుత్వాలను ఎన్నుకుంటున్నాం కదా అంది ఆ విద్యార్థిని. దానికి హర్‌జోత్‌ కాస్త కటువుగానే బదులిచ్చింది. ‘‘ఇది మూర్ఖత్వానికి పరాకాష్ట. అలా అనిపిస్తే ఓటేయకు. అప్పుడు మన దేశం పాకిస్తాన్‌ అవుతుంది. డబ్బు, సేవల కోసమే ఓటేస్తావా? అని ఆ విద్యార్థిని నిలదీసిందామె. దీంతో ఆ విద్యార్థిని ‘నేను భారతీయురాలిని. నేనెందుకు అలా చేస్తా’ అంటూ గట్టి సమాధానం ఇచ్చింది. ఆ వెంటనే.. అసలు ప్రభుత్వం నుంచి ప్రతీది ఎందుకు ఆశిస్తారని?.. ఆ ఆలోచనే తప్పని, సొంతంగా చేసుకునేందుకు ప్రయత్నించాలంటూ ఉచిత సలహా ఇచ్చింది హర్‌జోత్‌. అయితే ఈ వాడివేడి చర్చ ఇక్కడితోనే ఆగిపోలేదు.

ఇంతలో మరో విద్యార్థిని పైకి లేచి.. ఆస్పత్రిలో టాయిలెట్‌ బాగోలేదని, తరచూ బాలురు కూడా వస్తున్నారంటూ ఫిర్యాదు చేసింది. దీనికి హర్‌జోత్‌ కౌర్‌ భామ్రా స్పందిస్తూ.. ఇంట్లో నీకు వేర్వేరుగా టాయిలెట్స్‌ ఉంటాయా?.. వేర్వేరు ప్రాంతాలకు వెళ్లినప్పుడు.. ఇలా అడగడం ఎంత వరకు సమంజసం అంటూ ఎదురు ప్రశ్నించడంతో కంగు తినడం విద్యార్థిని వంతు అయ్యింది. 

Videos

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు