Breaking News

ఫలితాల పండుగకు క్వింటాళ్లలో లడ్డూల ఆర్డర్లు

Published on Mon, 06/03/2024 - 13:26

2024 లోక్‌సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్‌ వెలువడగానే దేశంలోని రాజకీయాలు తారాస్థాయికి చేరాయి. ఎన్డీఏ శిబిరంలో ఉత్సాహం వెల్లివిరుస్తోంది. మరోవైపు ఎగ్జిట్ పోల్స్‌ను తిరస్కరించే పనిలో మహాకూటమి నేతలు బిజీగా ఉన్నారు. అయితే యూపీలోని బీజేపీ శ్రేణుల ఉత్సాహం మిన్నంటుతోంది.  యూపీ రాజధాని పట్నాలో బీజేపీ కార్యకర్తలు లెక్కకుమించిన సంఖ్యలో లడ్డూలను ఆర్డర్ చేస్తున్నారు. మంగళవారం ఫలితాలు వెల్లడయ్యాక లడ్డూలు పంచుతూ సంబరాలు చేసుకునేందుకు వారు ప్లాన్‌ చేశారు.

పట్నాలో రాజస్థానీ నెయ్యి లడ్డూలతో పాటు మానేర్ లడ్డూలకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. మానేర్ లడ్డూ గురించి ప్రస్తావించారు.  ఈ నేపధ్యంలో ఈ లడ్డూలకు బీజేపీ నేతలు, కార్యకర్తలలో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. స్వచ్ఛమైన నెయ్యితో చేసిన రాజస్థానీ లడ్డూలు కిలో రూ.620కు విక్రయిస్తున్నారు. పట్నాకు చెందిన బీజేపీ నేతలు, కార్యకర్తలు ఒక మిఠాయి దుకాణంలో క్వింటాల్ లడ్డూలకు ఆర్డర్ ఇచ్చారు.

ఈ లడ్డూలు జూన్ 4న ఉదయం 9 నుండి 10 గంటల మధ్య బీజేపీ కార్యాలయానికి చేరుకోనున్నాయి. ఇందుకోసం బీజేపీ కార్యకర్తలు ముందుగానే సదరు దుకాణదారునికి డబ్బులు కూడా చెల్లించారు. స్వచ్ఛమైన నెయ్యి తో చేసిన క్వింటాల్ లడ్డూ ధర రూ. 62 వేలు అని దుకాణదారు తెలిపారు. 

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు