Breaking News

దెందులూరు ఎమ్మెల్యే చింతమనేనికి బిగ్‌ షాక్‌

Published on Sat, 07/26/2025 - 08:14

సాక్షి,  ఏలూరు జిల్లా:  వైయస్సార్‌సీపీ నేతలపై కక్ష సాధింపు రాజకీయాలకు దిగిన  దెందలూరు ఎమ్మెల్యేకి బిగ్‌ షాక్‌ తగిలింది. వైయస్సార్‌సీపీ నేతల అక్రమ అరెస్టులను ఖండించిన ఏలూరు కోర్టు.. విడుదలకు ఆదేశాలిచ్చింది. 

వైయస్సార్‌సీపీ నేతలపై వేధింపులకు దిగిన కూటమి నేతలకు న్యాయస్థానంలో చుక్కెదురైంది. గతంలో టీడీపీ నేత, ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, YSRCP యువజన విభాగం అధ్యక్షుడు కామిరెడ్డి నానిని జైలుకు పంపుతానంటూ బహిరంగంగా వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. 

ఈ క్రమంలో శుక్రవారం ఉదయం కామిరెడ్డి నానితో పాటు, మాజీ ఎమ్మెల్యే కొఠారి అబ్బయ్య చౌదరి సోదరులు తేజ, ప్రదీప్‌లను ఏలూరు పోలీసులు అరెస్ట్‌ చేసిన రూరల్‌ పీఎస్‌కు తరలించారు. ఈ అరెస్టులను వైయస్సార్సీపీ తీవ్రంగా ఖండించింది.  అయితే వీళ్లను ఎందుకు, ఏ కేసులో అరెస్ట్‌ చేశారో కూడా పోలీసులు చెప్పలేకపోయారు. దీంతో నిన్నంతా ఏలూరులో హైటెన్షన్‌ నెలకొంది. 

అయితే.. బెయిల్‌ మీద వ్యక్తిగత పూచీపై వీళ్ల విడుదలకు ఏలూరు ఫస్ట్ అడిషనల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు అనుమతించింది. అదే సమయంలో.. సిద్ధం సభ కేసు అంటూ పేర్కొనడాన్ని తోసిపుచ్చింది. ఈ క్రమంలో అక్రమంగా నిర్బంధించినందుకుగానూ పెదవేగి పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వో రామకృష్ణకు మెమో జారీ చేసింది. సమన్లు ఇచ్చాకే కోర్టులో హాజరుపర్చాలని తీర్పు ఇచ్చింది. చింతమనేని సవాల్‌ నేపథ్యంలోనే ఈ అరెస్ట్‌ జరిగిందనే చర్చ జోరుగా నియోజకవర్గంలో నడుస్తోంది.

Videos

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)