Breaking News

మానవత్వం లేని ప్రభుత్వం

Published on Mon, 05/29/2023 - 02:57

సాక్షి, నాగర్‌కర్నూల్‌: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు వట్టెం రిజర్వాయర్‌లో ముంపునకు గురైన నిర్వాసితుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం మానవత్వం లేకుండా వ్యవహరించిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. ఆదివారం ఆయన చేపట్టిన పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్ర 73వ రోజున నాగర్‌కర్నూల్‌ జిల్లా తాడూరు మండలం ఇంద్రకల్‌లో మాట్లాడారు. వట్టెం రిజర్వాయర్‌ నిర్వాసితులతో మాట్లాడిన అనంతరం సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు.

వట్టెం రిజర్వాయర్‌లో అన్‌కాన్‌పల్లితండా, కారుకొండతండా, రాంరెడ్డిపల్లితండా, జీగుట్టతండా, అన్‌కాన్‌పల్లి గ్రామాలు పూర్తిగా ముంపునకు గురవుతున్నాయని చెప్పారు. ఇక్కడి నిర్వాసితులంతా నూరు శాతం దళిత, గిరిజనులేనని పేర్కొన్నారు. వీరిపట్ల ప్రభుత్వం మానవత్వంతో వ్యవహరించి భూమికి భూమి, ఇల్లుకు ఇల్లు, ఉద్యోగం కల్పించా ల్సి ఉండగా బాధ్యతను మర్చిపోయిందని విమర్శించారు. సాక్షాత్తు సీఎం కేసీఆర్‌ భూ నిర్వాసితులకు ఉద్యోగం ఇస్తామన్న హామీ నెరవేర్చలేదన్నారు.

ప్రాజెక్టు ప్రారంభం సందర్భంగా సీఎం హామీతోనే నిర్వాసితులంతా సంతకాలు చేశారని, ఇప్పుడు వారిని ప్రభుత్వం మోసం చేసిందని దుయ్యబట్టారు. దీంతో నిర్వాసితులు ఉన్న ఊరు, భూమి, ఇల్లు, ఉపాధి కోల్పోయి దిక్కులేనివారయ్యారని ఆవేదన వ్యక్తంచేశారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం బాధితులకు భూమి, ఉద్యోగం, పరిహారం అందజేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం స్పందిచకపోతే పోరాడతామని హెచ్చరించారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)