Breaking News

ఎమ్మెల్సీ లేదా చైర్మన్‌ పోస్టులిస్తాం

Published on Sat, 04/20/2024 - 05:53

సాక్షి, హైదరాబాద్‌: పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పారీ్టకి మద్దతిస్తే సీపీఎంకి ఎమ్మెల్సీ లేదా కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవులు ఇస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హామీనిచ్చారు. ఈ మేరకు భట్టి శుక్రవారం సీపీఎం రాష్ట్ర కార్యాలయానికి వచ్చి పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కేంద్ర కమిటీ సభ్యు లు చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌. వీరయ్య, జూలకంటి రంగారెడ్డితో భేటీ అయ్యారు.

సుమారు 45 నిమిషాలకు పైగా పలు అంశాలపై చర్చించిన మీదట ఎట్టకేలకు పార్లమెంటు ఎన్నికల్లో కలిసి ప్రయాణించాలని ఆ రెండు పారీ్టలు అంగీకారానికి వచ్చాయి. ఈ సందర్భంగా భట్టి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణకు సంబంధించి పార్టీ ఆదేశాల మేరకు సీపీఎం కార్యాలయానికి వచ్చానని, ఎన్నికల్లో కలిసి ప్రయాణం చేద్దామని కోరానని చెప్పారు. ఇరు పారీ్టల పరంగా అభిప్రాయాలు పంచుకున్నామని చెప్పారు. ఇరు వురి అభిప్రాయాలపై సీఎం రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ అధిష్టానంతో మాట్లాడి శనివారం ఓ నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సాధారణ ఎన్నికల్లో కలిసి ప్రయాణించాలని ఇరు పార్టీలు సుహృద్భావ వాతావరణంలో ఓ అంగీకారానికి వచ్చామని అన్నారు. 

భువనగిరి స్థానంలో మద్దతు ఇమ్మన్న సీపీఎం 
భువనగిరి స్థానానికి కాంగ్రెస్‌ మద్దతు ఇవ్వాలని సీపీఎం నాయకులు భట్టిని కోరారు. మిగిలిన 16 స్థానాల్లో తాము మద్దతిస్తామని తెలిపారు. అయితే భువనగిరి స్థానంలో కూడా తమకే మద్దతు ఇవ్వాలని భట్టి కోరారు. అందుకు తాము ఎమ్మెల్సీ లేదా చైర్మన్‌ పదవులు ఇస్తామని హామీ ఇచ్చారు. 

భట్టి రావడం హ్యాపీ.. కానీ రేవంత్‌ అలా మాట్లాడకూడదు: తమ్మినేని 
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తమ పార్టీ కార్యాలయానికి రావడం, పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి పనిచేయాలంటూ కోరడం సంతోషకరమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. ఇది తమ ఆలోచనలకు అనుగుణంగానే ఉందన్నారు. సీట్లు, మద్దతు విషయంలో భట్టితో మాట్లాడామని చెప్పారు. భువనగిరి మినహా మిగతా స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీకి మద్దతివ్వడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం కలిసి చర్చించినపుడు తుది నిర్ణయానికి వస్తామన్నారు. కేరళలో సీఎం రేవంత్‌ రెడ్డి అలా మాట్లాడి ఉండాల్సింది కాదని తమ్మినేని వ్యాఖ్యానించారు.

Videos

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)