నీళ్ల గురించి తెలియకే.. కేసీఆర్‌ వ్యాఖ్యలకు కౌంటర్‌

Published on Tue, 02/06/2024 - 19:26

సాక్షి,హైదరాబాద్‌: కృష్ణా బోర్డు పరిధిలోకి ప్రాజెక్టులు వెళ్తే తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని.. కాంగ్రెస్‌కు ప్రాజెక్టులు, నీళ్ల గురించి అవగాహన లేదని మాజీ సీఎం కేసీఆర్‌ చేసీన వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కౌంటర్‌ ఇచ్చారు. అసులు కేసీఆర్‌కు నీళ్ల గురించి ఏం అవగాహన లేదని అన్నారు. కేసీఆర్‌కు నీళ్ల గురించి ఏం తెలియదు కాబట్టే కూలిపోయే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్‌ పార్టీకి నీళ్ల పూర్తి అవగాహన ఉంది కాబట్టే కాంగ్రెస్‌ హయాంలో శ్రీశైలం ప్రాజెక్టు, నాగార్జున సాగర్‌ ప్రాజెక్టులను నిర్మించామని తెలిపారు. నీళ్ల పేరుతో నిధులు దోచుకోవటమే కేసీఆర్‌ తెలుసని.. అలా చేయటం కాంగ్రెస్‌కు  తెలియదని అన్నారు. ఇక.. టీఆర్‌ఎసీ​ నిర్వహించే నల్గొండ సభ కంటే ముందే కేసీఆర్‌ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని భట్టి డిమాండ్‌ చేశారు.

కాళేశ్వరంతో తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం
నల్గొండలో సభ పెట్టడం కాదని.. సీఎం కేసీఆర్‌ కృష్ణా జలాలపై చర్చకు రావాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. కాళేశ్వరంతో తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేశారని మండిపడ్డారు.

‘తప్పు చేసిన వారిని బొక్కలో వేస్తాం. కేసీఆర్ తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలి. మేం అడిగిన ప్రశ్నలకి కేసీఆర్ సమాధానం చెప్పడం లేదు. కేసీఆర్ వల్ల తెలంగాణకి తీవ్రమైన నష్టం కలిగింది. అట్టహాసంగా చేసిన ప్రాజెక్టులు కులిపోతున్నాయి. బడ్జెట్ సమావేశాల్లో కాళేశ్వరంపై వచ్చిన విజిలెన్స్ రిపోర్ట్‌ను ప్రవేశ పెడతాం’ అని మంత్రి  ఉత్తమ్‌ తెలిపారు.

నల్గొండ సభలోపే.. చాలా మంది కాంగ్రెస్‌లోకి!
కేసీఆర్ తెలివి తక్కువోడు కాబట్టే కాళేశ్వరం కుప్పకూలిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ఉంటదో, ఊడుతదో నాలుగు రోజుల్లో తెలుస్తుందని అన్నారు. కేసీఆర్ వైఖరి వల్ల తెలంగాణ కు తీవ్ర నష్టం జరిగిందని, నల్లగొండ సభ పెట్టే లోపే చాలా మంది కాంగ్రెస్‌లో చేరుతారని తెలిపారు.
 

చదవండి:  కాంగ్రెస్‌ ప్రభుత్వానికి తెలివి లేదు

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)