Breaking News

RLD chief Jayant Choudhary: ఎన్డీఏలోకి ఆరెల్డీ

Published on Sat, 02/10/2024 - 05:18

లఖ్నో: చరణ్‌సింగ్‌కు భారతరత్న ప్రకటించడం ద్వారా నరేంద్ర మోదీ సర్కారు తన మనసు గెలుచుకుందని ఆయన మనవడు, ఇండియా కూటమి భాగస్వామి రాష్ట్రీయ లోక్‌దళ్‌ (ఆరెల్డీ) అధ్యక్షుడు జయంత్‌సింగ్‌ అన్నారు. ‘దిల్‌ జీత్‌ లియా (మనసు గెలుచుకుంది)’ అంటూ శుక్రవారం ఆయన ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. ఆ తర్వాత కొద్ది గంటలకే వచ్చే లోక్‌సభ ఎన్నికల కోసం ఉత్తరప్రదేశ్‌లో బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నట్టు మీడియాకు వెల్లడించారు. ‘‘మా తాతయ్యకు భారతరత్న ప్రకటించారు. ఎన్డీఏలో చేరాలన్న బీజేపీ ఆహా్వనాన్ని నేనెలా తిరస్కరించగలను?’’ అన్నారు.

‘‘ప్రధాని మోదీ ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నారు. మన దేశ స్వభావాన్ని, మౌలిక భావోద్వేగాలను తాను బాగా అర్థం చేసుకున్నానని నిరూపించుకున్నారు. కనుక సీట్లు, ఓట్ల చర్చ ఇప్పుడిక అప్రస్తుతం’’ అని జయంత్‌ స్పష్టం చేశారు. సర్దుబాటులో భాగంగా యూపీలో భాగ్‌పత్, బిజ్నోర్‌ లోక్‌సభ స్థానాలు ఆరెల్డీకి దక్కుతాయి. అలాగే ఒక రాజ్యసభ స్థానాన్ని కూడా బీజేపీ వాగ్దానం చేసినట్టు చెబుతున్నారు. ఉత్తర యూపీలో ఆరెల్డీకి చెప్పుకోదగ్గ పట్టుంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో యూపీలో బీజేపీ ఓడిన 16 స్థానాల్లో ఏడు అక్కడే ఉన్నాయి. జయంత్‌ నిర్ణయంతో యూపీలో సమాజ్‌వాదీ పార్టీకి షాక్‌ తగిలింది.

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)