Breaking News

Bharat Jodo Nyay Yatra: అన్యాయాన్ని ప్రశ్నించేందుకే...

Published on Mon, 01/15/2024 - 04:46

థౌబాల్‌/ఇంఫాల్‌: జాతుల ఘర్షణలతో అట్టుడికిపోతున్న కల్లోల మణిపూర్‌ రాష్ట్రానికి శాంతి, సామరస్యం తిరిగి తీసుకొస్తామని కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ హామీ ఇచ్చారు. మణిపూర్‌లోని థౌబాల్‌ నుంచి ‘భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర’కు ఆదివారం ఆయన శ్రీకారం చుట్టారు. తొలుత ఖోంగ్‌జామ్‌ యుద్ధ స్మారకం వద్ద నివాళులర్పించారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు. ఘర్షణలతో రాష్ట్రంలో లక్షలాది మంది అమాయకులు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

వారి కన్నీళ్లు తుడిచేందుకు, చేయూతనిచ్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికీ రాకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. మోదీ, బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ దృష్టిలో మణిపూర్‌ రాష్ట్రం భారతదేశంలో అంతర్భాగం కాకపోవచ్చని ఆక్షేపించారు. ‘‘మీ బాధను వారి బాధగా భావించడం లేదు. కానీ మీ దుఃఖాన్ని, మీకు తగిలిన గాయాలు, మీరెదుర్కొంటున్న విచారాన్ని మేం అర్థం చేసుకున్నాం’’ అని చెప్పారు. బాధితులు ఆప్యాయతను కోరుకుంటున్నారని రాహుల్‌ అన్నారు.

ప్రజల ‘మన్‌ కీ బాత్‌’ వింటాం
దేశంలో అన్యాయ కాలం కొనసాగుతున్నందు వల్లే న్యాయ యాత్ర చేపట్టాల్సి వచ్చిందని రాహుల్‌ పేర్కొన్నారు. ప్రజలు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా అన్యాయాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ ప్రజలను ఏకం చేయాలన్నదే ఈ యాత్ర ఉద్దేశమని వివరించారు. సమానత్వం, సౌభ్రాతృత్వం, సామరస్యంతో కూడిన ‘న్యూ విజన్‌ ఆఫ్‌ ఇండియా’ను సాధించడం ధ్యేయమని స్పష్టం చేశారు. ‘‘ఈ యాత్రలో ప్రజల ‘మన్‌ కీ బాత్‌’ వింటాం.

ప్రజలను నేరుగా కలుసుకొని, వారి సమస్యలు అడిగి తెలుసుకుంటాం’’ అని వెల్లడించారు. బీజేపీ క్షుద్ర రాజకీయాల వల్ల మణిపూర్‌లో శాంతి, సామరస్యం కనుమరుగు అయ్యాయని రాహుల్‌ ద్వజమెత్తారు.  సమాజంలో విద్వేషం, హింస, అరాచకత్వానికి స్థానం ఉండకూడదని చెప్పారు. దేశ సంపద కొందరి జేబుల్లోకి వెళ్తోందని రాహుల్‌ ఆరోపించారు. ఒకరిద్దరు వ్యాపారవేత్తలు మొత్తం ఆర్థిక వ్యవస్థపై గుత్తాధిపత్యం సాధిస్తున్నారని మండిపడ్డారు.

అన్ని వ్యాపారాల్లోకి వారు ప్రవేశిస్తున్నారని, ఫలితంగా చిన్న, మధ్య తరహా వ్యాపారాలు మూతపడుతున్నాయని పేర్కొన్నారు. నిరుద్యోగం, ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని గుర్తుచేశారు. దేశ జనాభాలో అధిక భాగం ఉన్న కింది కులాలు, దళితులు, గిరిజనులకు రాజకీయ వ్యవస్థలో, ప్రభుత్వ పాలనా వ్యవస్థలో భాగస్వామ్యం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశాలన్నింటినీ యాత్రలో లేవనెత్తుతామని తెలిపారు.

రాహుల్‌ యాత్రలో బీఎస్పీ బహిష్కృత ఎంపీ డానిష్‌ అలీ
ఇటీవల బీఎస్పీ నుంచి బహిష్కరణకు గురైన లోక్‌సభ సభ్యుడు డానిష్‌ అలీ రాహుల్‌తో పాటు యాత్రలో పాల్గొన్నారు. ఆయన కాంగ్రెస్‌లో చేరతారని తెలుస్తోంది. రాహుల్‌ యాత్రపై మణిపూర్‌ సీఎం బీరేన్‌ సింగ్‌ మండిపడ్డారు. ‘‘రాష్ట్రంలో ఘర్షణలింకా ఆగలేదు. ఇలాంటప్పుడు యాత్ర పేరుతో పరిస్థితిని దిగజార్చడానికి వచ్చారా?’’ అంటూ మండిపడ్డారు.

Videos

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి