రాహుల్‌ గాంధీ కారు అద్దాలు ధ్వంసం

Published on Wed, 01/31/2024 - 14:09

పాట్నా: కాంగ్రెస్‌ అగ్రనేత, ఎంపీ రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర బీహార్‌లో రెండోరోజు కొనసాగుతోంది. అయితే కాంగ్రెస్‌ కార్యకర్తలు, అభిమానుల అత్యుత్సాహంతో ఆయన కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. బుధవారం కథిహార్‌లో ఈ ఘటన జరిగింది. 

రాహుల్‌ చేపట్టిన భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర బీహార్‌లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. ఇటీవలి అక్కడి రాజకీయ పరిణామాలతో సంబంధం లేకుండా ఆయనకు బ్రహ్మరథం పట్టారు అక్కడి ప్రజలు. ఇక ఇవాళ ఉదయం డీఎస్‌ కాలేజీ వద్ద ఆయన ర్యాలీ నిర్వహించగా.. కాంగ్రెస్‌ కార్యకర్తలు, అభిమానులు ఆయన కారు మీదకు ఎక్కి నినాదాలు చేసే యత్నం చేశారు. ఈ క్రమంలో కారు విండ్‌షీల్డ్‌ పగిలిపోయింది. దీంతో రాహుల్‌ భద్రతా సిబ్బంది వారిని వారించి కిందకు దించగా.. పగిలిన కారు అద్ధాలతోనే ఆయన ర్యాలీని ముందుకు సాగించారు. 

ఇదిలా ఉంటే.. మహాఘట్‌ బంధన్‌ కూటమి నుంచి నిష్క్రమించి తిరిగి బీజేపీతో జట్టు కట్టి ప్రభుత్వం ఏర్పాటు చేశారు నితీశ్‌ కుమార్‌. దీంతో రాహుల్‌ యాత్ర బీహార్‌లో ఎలా సాగుతుందా? అనే అనుమానాలు నెలకొన్నాయి. అయితే నిన్న రాహుల్‌ యాత్రకు అపూర్వ స్వాగతం దక్కిందని సీనియర్‌ నేత జైరామ్‌ రమేష్‌ సైతం తన ఎక్స్‌ ఖాతాలో ట్వీట్‌ చేశారు. 

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)