Breaking News

రాజస్థాన్‌ సీఎంగా భజన్‌లాల్‌ శర్మ

Published on Tue, 12/12/2023 - 16:28

జైపూర్‌: రాజస్థాన్‌ ముఖ్యమంత్రి విషయంలోనూ బీజేపీ అనూహ్య నిర్ణయం వైపే మొగ్గు చూపించింది. ఓసీ సామాజిక వర్గానికి చెందిన భజన్‌లాల్‌ శర్మను సీఎంగా ప్రకటించింది. బీజేపీ శాసనసభాపక్షనేతగా  భజన్‌లాల్‌ శర్మను మంగళవారం జరిగిన సీఎల్పీ భేటీలో బీజేపీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. భజన్‌లాల్‌ తొలిసారి ఎమ్మెల్యేగా నెగ్గడం గమనార్హం. డిప్యూటీ సీఎంలుగా దియాకుమారి, ప్రేమచంద్‌ భైరవను బీజేపీ ప్రకటించింది. అదే విధంగా స్పీకర్‌ వాసుదేవ్‌ దేవ్‌నాని ఎంపిక చేసిదంది.

కేంద్ర మంత్రి రాజనాథ్‌ సింగ్‌, బీజేపీ పరిశీలకులు రాజస్థాన్‌ సీఎం ఎంపిక ప్రక్రియను నిర్వహించారు. బీజేపీ ఎల్పీ ముగిసిన అనంతరం భజన్‌లాల్‌ శర్మ పేరును రాజస్థాన్‌ ముఖ్యమంత్రిగా అధికారికంగా ప్రకటించారు.

ఇక రాజస్థాన్‌ ముఖ్యమంత్రి రేసులో వసుంధర రాజే, దియాకుమారి, అర్జున్‌రామ్‌, గజేంద్ర షెకావత్‌, అశ్విని వైష్ణవ్‌ లాంటి సీనియరల​ పేర్లు వినిపించాయి. తీవ్ర సస్పెన్స్‌ కొనసాగించిన అనంతరం బీజేపీ అధిష్టానం.. చివరి నిమిషంలో భజన్‌లాల్‌ పేరును తెరపైకి తెచ్చింది. చివరకు ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ తరహాలోనే రాజస్థాన్‌ విషయంలోనూ కొత్త ముఖాన్ని ఎంచుకుంది. 

56 ఏళ్ల భజన్ లాల్‌ శర్మ.. పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చదివారు. భజన్‌ లాల్‌ రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో సంగనేర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. సమీప కాంగ్రెస్‌ అభ్యర్థి పుష్పేంద్ర భరద్వాజ్‌పై 48,081 ఓట్లతో విజయం సాధించారు.

చదవండి: నెహ్రూపై అమిత్‌ షా వ్యాఖ్యలు.. రాహుల్‌ గాంధీ కౌంటర్‌

Videos

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)