Breaking News

సీఎం మమత వ్యాఖ్యలపై గవర్నర్‌ అభ్యంతరం.. ‘నివేదిక ఇవ్వండి’

Published on Tue, 07/23/2024 - 12:35

కోల్‌కతా: నిస్సహాయులైన బంగ్లాదేశ్‌ ప్రజలకు ఆశ్రయం కల్పిస్తామని పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ఇటీవల వ్యాఖ్యానించారు. ఆమె చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర గవర్నర్‌ సీవీ ఆనంద్‌ బోస్‌ తీవ్రంగా ఖండించారు. అదేవిధంగా మమత చేసిన వ్యాఖ్యలపై వివరణతో కూడిన నివేదిక సమర్పించాలని కోరారు.

‘విదేశి వ్యవహారాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకునే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఈ విషయాన్ని బెంగాల్ ప్రభుత్వానికి గుర్తుచేస్తున్నాం. విదేశాల నుంచి భారత్‌కు వచ్చేవారికి ఆశ్రయం కల్పించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారం. విదేశాల నుంచి వచ్చే ప్రజలకు ఆశ్రయం కల్పిస్తామని సీఎం బహిరంగంగా ప్రకటించటం రాజ్యాంగ  ఉల్లంఘనకు పాల్పడటాన్ని సూచిస్తుంది.  సీఎం మమత వ్యాఖ్యలపై రాష్ట్ర గవర్నర్‌ సీవీ ఆనంద్‌ ఆర్టికల్ 167 ప్రకారం వివరణతో కూడిన నివేదిక సమర్పించాలని కోరారు.’అని రాజ్‌భవన్‌ మీడియా సెల్ ‘ఎక్స్‌’లో పేర్కొంది.

బంగ్లాదేశ్‌లో ప్రభుత్వం ఉద్యోగాల్లో రిజర్వేషన్‌ కోటాను వ్యతిరేకిస్తూ.. విద్యార్థులు చేసిన నిరసన హింసాత్మకంగా మారింది. వారం రోజులు పాటు తీవ్రంగా జరిగిన విద్యార్థుల ఆందోళలో వందకుపైగా నిరసనకారులు మృతి చెందారు. ఇలాంటి సమయంలో సరిహద్దు రాష్ట్రం పశ్చిమబెంగాల్‌ సీఎం మమత చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి.

Videos

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు