కొత్త క్రిమిన‌ల్ చ‌ట్టాల అమ‌లును వాయిదా వేయండి: మోదీకి మ‌మ‌తా లేఖ‌

Published on Fri, 06/21/2024 - 13:38

ప‌శ్చిమ బెంగాల్ ముఖ్యంమ‌త్రి మ‌మ‌తా బెన‌ర్జీ శుక్ర‌వారం ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీకి లేఖ రాశారు. కేంద్ర ప్ర‌భుత్వం ఇటీవ‌ల ఆమోదించిన మూడు కొత్త నేర చ‌ట్టాల అమ‌లును వాయిదా వేయాల‌ని ఆమె కోరారు.  

కాగా జూలై ఒక‌టో తేదీ నుంచి కొత్త చ‌ట్టాలు అమ‌లులోకి రానున్నాయి. అయితే క్రిమిన‌ల్‌ చ‌ట్టాల‌ను వాయిదా వేయ‌డం వ‌ల్ల పార్లమెంట్‌లో వీటిపై సమీక్ష జ‌రిపే అవ‌కాశం ఉంటుంద‌ని దీదీ పేర్కొన్నారు.

ఇదిలా ఉండ‌గా భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, భారతీయ సాక్ష్యా చట్టాల‌ను కేంద్రంలోని ఇటీవ‌ల బీజేపీ ప్ర‌భుత్వం రూపొందించిన విష‌యం తెలిసిందే.

బ్రిటిష్ కాలం నాటి ఇండియన్ పీన‌ల్ కోడ్‌, క్రిమిన‌ల్ ప్రొసీజ‌ర్ కోడ్‌, ఇండియ‌న్ ఎవిడెన్స్ యాక్ట్ 1872  చ‌ట్టాల స్థానంలో కేంద్రం వీటిని తీసుకొచ్చింది.  ఈ కొత్త చట్టాలు దేశంలోని పౌరులకు సత్వర న్యాయం అందించాల‌న్న ఉద్ధేశ్యంతో వీటిని రూపొందించారు. న్యాయ వ్య‌వ‌స్థ‌ను,  కోర్టు నిర్వహణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఈ చ‌ట్టాలు ఉప‌యోగ‌ప‌డనున్నాయి.

Videos

బస్సును ముద్దాడిండు డ్రైవరన్న

ప్రియుడితో కలిసి భర్తను చంపేందుకు భార్య కుట్ర

అవి వాళ్ళు రాస్తే వచ్చే మార్కులు కాదు.. SGT ప్రభాకర్ కు ఉద్యోగం ఎలా ఇచ్చారంటే

ఇంకెన్నాళ్లు నీ కొడుకును కాపాడుకుంటావ్.. వైఎస్ జగన్ సెన్సేషనల్ కామెంట్స్

ఒక రోజుకు 80 లక్షలు... ఎవడబ్బ సొమ్మని ఖర్చు పెడుతున్నారు..!

చైనా వేదికపై ఫేక్ మేయర్ ప్రచారం?

కొండా రెడ్డి బురుజు సాక్షిగా దొరికిన బడి దొంగలు

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)