దేశానికి ప్రధానిగా మోదీ అవసరం లేదు: సీఎం మమత

Published on Wed, 05/29/2024 - 12:39

కోల్‌కతా: తనను దేవుడు గొప్ప ఉద్దేశమే కోసం భూమిపైకి పంపించాడని ఇటీవల ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ విమర్శలు గుప్పించారు. కోల్‌కతాలో లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ ర్యాలీలు పాల్గొని  మమత మాట్లాడారు. ప్రధాని మోదీ తనకు తాను ఒక దైవాంశ సంభూతుడిగా చెప్పుకుంటున్నారు. అలా అయితే మోదీ తనకోసం ఒక దేవాలయం కట్టించుకొని అందులో కూర్చోవాలి. అంతేగాని దేశాన్ని ఇబ్బందుల పాలుచేయటం మానుకోవాలని సీఎం మమత ఎద్దేవా చేశారు.

‘‘ఒక నేత మోదీని దేవుళ్లకే దేవుడు అంటారు.. మరో నేత పూరీ జగన్నాథ్‌ స్వామినే మోదీ భక్తుడు అంటారు. ఒకవేళ మోదీ దేవుడు అయితే ఆయన ఎట్టిపరిస్థితుల్లో రాజకీయాలు చేయకూడదు. దేవుడు ఎప్పడు అల్లర్లను ప్రేరేపంచడు’’ అని సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. 

‘‘అటల్‌ బిహారీ వాజ్‌పయి వంటి ఎంతోమంది ప్రధాన మంత్రులతో నేను కలిసి పనిచేశాను. వాళ్లు అందరూ నాతో ప్రేమగా మెలిగేవారు. మన్మోహన్‌సింగ్‌, రాజీవ్‌ గాందీ, పీవీ, దేవేగౌడ వంటి  ప్రధానులతో పని చేశాను కానీ, మోదీ వంటి ప్రధానిని నేను చూడలేదు. ఇటువంటి ప్రధాని భరతదేశానికి అవసరం లేదు’’ అని మోదీపై సీఎం మమత ధ్వజమెత్తారు.

ఇటీవల ప్రధాని మోదీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను భౌతికంగా జన్మించలేదు. తనను భూమిపైకి దేవుడే పంపాడన్న విషయం తెలిసిందే. అదేవిధంగా బీజేపీ పూరీ పార్లమెంగ్‌ నియోజకవర్గ అభ్యర్థి మీడియాతో మాట్లాడుతూ.. పూరీ​ జగన్నాథ స్వామి ప్రధాని మోదీకి భక్తుడని వ్యాఖ్యానించిన సంగతి విధితమే. 

Videos

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)