Breaking News

‘బీజేపీ స్త్రీ వ్యతిరేక పార్టీ.. సీతామాత గురించి మాట్లాడదు’

Published on Mon, 01/22/2024 - 21:28

కోల్‌కతా: అయోధ్యలో బాల రాముడి ప్రాణప్రతిష్ట నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీపై విమర్శలు గుప్పించారు. బీజేపీ స్త్రీ వ్యతిరేక పార్టీ మండిపడ్డారు. సోమవారం మమతా బెనర్జీ మీడియాతో మాట్లాడారు. బీజేపీ పార్టీ ఎప్పుడు రాముడి గురించే మాట్లాడుతుందని.. సీత గురించి ఎక్కడా ప్రస్తావించదని తెలిపారు. దీంతో బీజేపీ పార్టీ ఓ స్త్రీ వ్యతిరేక పార్టీ అని అర్థం చేసుకోవచ్చని దుయ్యబట్టారు. అయోధ్య రామ మందిరంలోని రాముడి ప్రాణప్రతిష్ట జరిగిన రోజే మమతా బీజేపీపై మాటల దాడి చేశారు.

‘బీజేపీ వాళ్లు రాముడి గురించే మాట్లాడుతారు. సీతాదేవి గురించి ఎందుకు మాట్లాడరు? వనవాసం సమయంలో కూడా సీతాదేవి రాముడి వెంటే ఉంది. కానీ, బీజేపీ వాళ్లు సీతా దేవి గురించి ఏమాత్రం ప్రస్తావించరు. దీంతో వాళ్లు ఎంతటి స్త్రీ వ్యతిరేకులో తెలుసుకోవచ్చు. తాను దుర్గా మాతను పూజిస్తాను. ఇలాంటి వాళ్లు(బీజేపీ) భక్తి, మతం గురించి ఉపన్యాసాలు ఇవ్వటం సరికాదు’ అని మమతా బెనర్జీ మండిపడ్డారు. 

తాను ఎన్నికల కోసం మతాన్ని రాజకీయం చేయటాన్ని నమ్మనని తెలిపారు. మత రాజకీయలు ఎప్పుడు చేయనని అన్నారు. అలా చేయటానికి చాలా వ్యతిరేకినని చెప్పారు. రాముడిపై భక్తి, విశ్వాసం కలిగి ఉండటంపై తానను ఎటువంటి అభ్యంతరం లేదన్నారు. కానీ, ప్రజల ఆహార అలవాట్లపై జోక్యం చేయటాన్ని మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తానని అన్నారు. ఇక.. మమతా బెనర్జీ అయోధ్య బాల రాముడి ప్రాణప్రతిష్టకు హాజరు కాలేదన్న విషయం తెలిసిందే. 

చదవండి: కొత్త పథకాన్ని ప్రకటించిన మోదీ

Videos

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు