Breaking News

కాంగ్రెస్‌ సీఎం ఎవరు?.. భట్టి ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

Published on Wed, 07/12/2023 - 21:04

సాక్షి, తిరుపతి: తెలంగాణలో మరోసారి రాజకీయం రసవత్తరంగా మారింది. తాజాగా తెలంగాణలో ఉచిత కరెంట్‌పై కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఉచిత కరెంట్‌పై ఇరు పార్టీల నేతలు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇక, టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి.. కేసీఆర్‌ కుటుంబాన్ని టార్గెట్‌ చేసి సంచలన కామెంట్స్‌ చేసిన విషయం తెలిసిందే. ఇక, ఉచిత కరెంట్‌ అంశంపై తాజాగా సీఎ‍ల్పీ నేత భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. 

అయితే, భట్టి విక్రమార్క ప్రస్తుతం తిరుమలలో ఉన్నారు. ఇక, తిరుచానూర్‌ శ్రీ పద్మావతి అమ్మవారిని భట్టి దర్శించుకున్నారు. అనంతరం, భట్టి మీడియాతో మాట్లాడుతూ.. ఉచిత విద్యుత్‌ అనేది కాంగ్రెస్‌ డీఎన్‌ఏలోనే ఉంది. దివంగత సీఎం వైఎస్సార్‌ ఉచిత విద్యుత్‌పై తొలి సంతకం చేశారు. తెలంగాణ ప్రజలందరూ కాంగ్రెస్‌కు అండగా ఉన్నారు. ఉచిత కరెంట్‌ పేరుతో​ బీఆర్‌ఎస్‌ రాజకీయం చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో సీఎం ఎవరనేది కాంగ్రెస్‌ అధిష్టానం నిర్ణయిస్తుంది అంటూ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశారు. 

అంతకు ముందు టీపీసీసీ రేవంత్‌ రెడ్డి ట్విట్టర్‌ వేదికగా కేసీఆర్‌ సర్కార్‌, ఫ్యామిలీని టార్గెట్‌ చేసి కీలక వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్‌లో ‘‍కల్వకుంట్ల అన్నా చెల్లెళ్లు “మూడు గంటలు” అని దుష్ఫ్రచారం చేసినా, మూడు చెరువుల నీళ్లు తాగినా.. మీరు మూడో సారి అధికారంలోకి రావడం కల్ల. వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే.. రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇచ్చేది కాంగ్రెస్ పార్టీనే’ అని తెలిపారు. 

ఇది కూడా చదవండి: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. మూడు రోజులు జోరు వానలే..

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)