Breaking News

హిందీ పేపర్‌ను ఎవడైనా లీక్‌ చేస్తారా?: బండి సంజయ్‌

Published on Fri, 04/07/2023 - 09:26

సాక్షి, కరీంనగర్‌: పేపర్‌ లీకేజీ వ్యవహారంలో కోర్టు ఆదేశాలతో​ తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ జైలు నుంచి విడుదలయ్యారు. ఈ కేసులో హన్మకొండ కోర్టు సంజయ్‌కు బెయిల్‌ ఇవ్వడంతో జైలు నుంచి బయటకు వచ్చారు. అనంతరం, కేసీఆర్‌ సర్కార్‌, కేటీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్‌ను బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. 

విడుదల అనంతరం బండి సంజయ్‌ మీడియాతో మాట్లాడుతూ.. టీఎస్‌పీఎ‍స్సీ పేపర్‌ లీక్‌ కేసులో సిట్టింగ్‌ జడ్జీతో​ విచారణ జరిపించాలి. కేటీఆర్‌ను బర్తరఫ్‌ చేయాలి. పేపర్‌ లీకేజీలో నష్టపోయిన నిరుద్యోగులకు లక్ష రూపాయల భృతి ఇవ్వాలి. జిమ్మిక్కులతో ఇష్యూను డైవర్ట్‌ చేయాలని చూస్తున్నారు. హిందీ పేపర్‌ ఎవడైనా లీక్‌ చేస్తారా. మరి తెలుగు పేపర్‌ను ఎవరు లీక్‌ చేశారు?. పేపర్‌ను ఎవరో లీక్‌ చేస్తే నాకేంటి సంబంధం అని ప్రశ్నించారు. సరే లీకేజ్‌ అని అంటున్నారు కదా.. అసలు పరీక్ష సెంటర్‌లోకి ఫోన్లు ఎట్లా తీసుకువెళ్లారు.

పోలీసులు, ఇన్విజిలేటర్లు ఏం చేస్తున్నారు. ఫోన్లు లోపలికి ఎలా తీసుకుపోయారు? ఎవరు తీసుకుపోయారో దర్యాప్తు చేయండి. అవి ఏవీ చేయకుండా నన్ను కుట్రపూరితంగా అరెస్ట్‌ చేశారు. సీపీ ప్రమాణం చేసి తాను చెప్పిందంతా నిజమని చెప్పాలి. కరీంనగర్‌ పోలీసులు పోస్టుల కోసం, డబ్బుల కోసం పనిచేస్తున్నారు. సీపీ అసత్యాలు మాట్లాడుతున్నారు. వాట్సాప్‌లో ఎవరో పేపర్‌ షేర్‌ చేస్తే నాకేంటి సంబంధం అని ప్రశ్నించారు. లీక్‌కు, మాల్‌ ప్రాక్టీస్‌కు కూడా సీపీకి తేడా తెలియదా?. 

కేసీఆర్‌ అడ్డగోలుగా డబ్బు సంపాదించారు. రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ వ్యాఖ్యలపైనా విచారణ జరపాలి. కేసీఆర్‌ బిడ్డ కవిత జైలుకు పోతుంది. కొడుకు కేటీఆర్‌ కూడా పోతాడు. తెలంగాణ రాష్ట్రం తాగుబోతుల చేతిలో ఉంది. కేసీఆర్‌ కుటుంబం నియంత పాలనపై తెలంగాణ ప్రజలు విసిగిపోయారు. నయా నిజాం కేసీఆర్‌ను తరిమికొడతాం. మంత్రి హరీష్‌రావు పచ్చి అబద్దాలు చెబుతున్నారు. కేటీఆర్‌ను సీఎం చేస్తే హరీష్‌రావే ముందుగా పార్టీ నుంచి జంప్‌ అవుతారు అంటూ ఆసక్తికర కామెంట్స్‌ చేశారు.

చదవండి: జైలు నుంచి బండి సంజయ్‌ విడుదల.. 144 సెక్షన్‌ విధింపు!

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)