Breaking News

దమ్ముంటే కేసులు పెట్టండి.. కేసీఆర్‌కు బండి సంజయ్‌ సవాల్‌ 

Published on Thu, 08/11/2022 - 15:41

Bandi Sanjay.. తెలంగాణ పాలిటిక్స్‌ రోజుకో మలుపు తిరుగుతోంది. నేడు ఒక పార్టీలో ఉన్న నేత మరుసటి రోజు ఏ పార్టీలో చేరుతున్నారో అర్థంకాని పరిస్థితులు నెలకొన్నాయి. కొద్దిరోజుల కిత్రం కాంగ్రెస్‌ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి.. హస్తానికి గుడ్‌ బై చెప్పి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. 

కాగా, తాజాగా సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్‌ సవాల్‌ విసిరారు. బండి సంజయ్‌ పాదయాత్ర 9వ రోజు గురువారం రామన్నపేటకు చేరుకుంది. ఈ సందర్భంగా బండి సంజయ్‌ మాట్లాడుతూ.. ‘‘పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో కేసీఆర్‌ రాజీనామా చేయించాలి. నైతిక విలువలుంటే ఉప ఎన్నికలో కొట్లాడుదాం రండి. లీటర్‌ పెట్రోల్‌పై రూ.30 దోచుకుంటూ ధరల పెంపుపై మాట్లాడటం సిగ్గుచేటు. కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌కు నీళ్ల కోసం రూ. లక్షకోట్లకు పైగా ఖర్చు చేశారు. యాద్రాద్రి ప్రాంత ప్రాజెక్ట్‌ కోసం రూ.700 కోట్లు ఖర్చుపెట్టలేరా? అని ప్రశ్నించారు.

సీఎం కేసీఆర్‌ మాటలన్నీ గాలి మాటలే. ప్రజలు సీఎం మాటలు నమ్మే పరిస్థితి లేదు. కేంద్రం నిధులు ఇవ్వడం లేదనేది అవాస్తవం. నకిరేకల్ నియోజకవర్గానికి ఎన్ని నిధులు‌ ఇచ్చామో లెక్కలు చెప్పాం. తప్పైతే, దమ్ముంటే కేసులు పెట్టుకోండి. మునుగోడులో బీజేపీ గెలుపు ఖాయం. పార్టీ ఫిరాయించిన పన్నెండు మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలి’’ అని డిమాండ్‌ చేశారు. 

ఇది కూడా చదవండి: బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా సునీల్‌ బన్సల్‌

Videos

మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్

బెడ్ రూమ్ లోకి కింగ్ కోబ్రా ఏం చేశాడో చూడండి..

వల్లభనేని వంశీ ఆరోగ్యంపై భార్య పంకజశ్రీ కీలక వ్యాఖ్యలు

విజయవాడ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు

ప్రభుత్వం మాది..మీ అంతు చూస్తా : Pawan Kalyan

లక్షా 40 వేల కోట్ల అప్పు తెచ్చి ఏం చేశారు బాబుపై బొత్స ఫైర్

మీకు చుక్కలు చూపిస్తా! Deputy CM

Ding Dong 2.0: కామిక్ షో

రగిలిపోతున్న పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి వార్నింగ్

భారీగా పెరుగుతున్న కరోనా, దేశంలో హైఅలర్ట్..

Photos

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)