Breaking News

రాహుల్‌ గాంధీ హామీలు పెద్ద జోక్‌

Published on Fri, 03/15/2024 - 04:41

బోయినపల్లి(చొప్పదండి): కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే దేశంలో ప్రతి మహిళ పేరిట రూ.లక్ష చొప్పున బ్యాంకులో జమచేస్తా మని, ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తానంటూ ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ చేస్తున్న హామీలు పెద్దజోక్‌ అని బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ విమర్శించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో గురువారం జరిగిన ప్రజాహితయాత్రలో ఆయన మాట్లాడారు.

కాంగ్రెస్‌ అధికారంలోకి ఎలాగూ రాలేదని అర్థమై, అడ్డగోలు హామీలు ఇస్తున్నారన్నారు. రిజర్వేషన్ల విషయం తర్వాత కానీ.. మొదట కాంగ్రెస్‌ పార్టీ పదవులు, లోక్‌సభ ఎన్నికల్లో 50 శాతం టికెట్లు మహిళలకు ఇవ్వాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలకు ఇప్పటికీ దిక్కులేదని చెప్పారు. 17 ఎంపీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే రాష్ట్రానికి అధిక నిధులు తీసుకొస్తామన్నారు. బోయినపల్లి మండలకేంద్రంలో మెదక్‌ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావు మాట్లాడుతూ బండి సంజయ్‌ గెలిస్తే మోదీ ప్రభుత్వంలో మంత్రిపదవి వస్తుందని పేర్కొన్నారు. 

Videos

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)