Breaking News

అంజన్న సాక్షిగా అబద్ధాలు చెబుతారా?

Published on Fri, 04/12/2024 - 03:49

కరీంనగర్‌ టౌన్‌: ఆరు గ్యారంటీలను అమలు చేశామని అంటున్న కాంగ్రెస్‌ నేతలు కొండగట్టు అంజన్న సాక్షిగా పచ్చి అబద్ధాలు ఆడారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ విమర్శించారు. కొండగట్టు అంజన్న చాలా పవర్‌ ఫుల్‌ అని, ఆయన సన్నిధిలో అబద్ధాలాడిన, దొంగ హామీలిచ్చిన కేసీఆర్, ఆయన కుమార్తె కవితకు ఏ గతి పట్టిందో కాంగ్రెస్‌ నేతలకూ అదే గతి పడుతుందని హెచ్చరించారు.

‘ఆరు గ్యారంటీలను అమలు చేశామంటున్న ఆ కాంగ్రెస్‌ నేతను అడుగుతున్నా.. మహిళలకు ప్రతి నెలా రూ.2500 ఎంతమందికి ఇచ్చారు..? రైతులు, కౌలు రైతులకు రూ.15వేలు, వ్యవసాయ కూలీలకు రూ.12వేలు ఎంతమందికి అందించారు..? ధాన్యం క్వింటాల్‌కు రూ.500 చొప్పున బోనస్‌ ఇచ్చారా..? తరుగు లేకుండా ధాన్యాన్ని సర్కారే కొనుగోలు చేస్తామన్నారు.. చేశారా..? అని ప్రశ్నించారు.

కరీంనగర్‌లో గురువారం పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని బీజేపీ మండలాల అధ్యక్షులు, ఇన్‌చార్జిల తో బండి çసమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ కుమ్కక్కై నయ్‌.. రెండుపార్టీలు కలిసి నన్ను ఓడించడానికి కుట్ర చేస్తున్నయి.’’ అని ఆరోపించారు. ప్రజలకు కాంగ్రెస్‌ మంచి చేస్తే పొన్నం ప్రభాకర్‌ కరీంనగర్‌ నుంచి హుస్నాబాద్‌కు ఎందుకు పారిపోయారని ప్రశ్నించారు. ఈ నెల 21న వేలాదిమందితో కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ బీజేపీ అభ్యర్ధిగా నామినేషన్‌ వేస్తున్నట్లు బండి ప్రకటించారు.­

Videos

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

ZPTC, MPTC స్థానాలకు షెడ్యూల్

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)