Breaking News

టీడీపీ బస్సుయాత్రలో బాహాబాహీ

Published on Mon, 06/26/2023 - 04:18

పెనుకొండ: శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజ­కవర్గంలో టీడీపీ నాయ­కుల వర్గపోరు తారస్థాయికి చేరింది. భవిష్యత్తుకు గ్యారెంటీ పేరిట చేపట్టిన బస్సుయాత్ర సందర్భంగా ఆదివారం మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి, పార్టీ నాయకురాలు సవితమ్మ వర్గీ­యులు పెనుకొండ పట్టణంలో బాహాబాహీకి దిగారు. నడిరోడ్డుపైనే తన్నుకున్నారు. బస్సుయాత్ర ఆదివారం శెట్టిపల్లి నుంచి వివిధ గ్రామాల మీదుగా పెనుకొండకు చేరుకుంది.

స్థానిక మడకశిర సర్కిల్లోని ఎన్‌టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేయడానికి ముందు సమీపంలోని టీడీపీ కార్యాలయం వద్ద సవితమ్మ వర్గీయులు బాణాసంచా కాలుస్తూ కేకలు వేశారు. దీంతో ఆగ్రహానికి లోనైన బీకే పార్థసారథి.. సవితమ్మ వర్గీయులను తీవ్రస్థాయిలో హెచ్చ­­రించారు. ‘పోటు పొడిచారు.. మీ కథ చూస్తా..’ అంటూ హెచ్చరించారు. బస్సుయాత్రలో వెను­కనే ఉండి డ్రామాలాడుతోందంటూ సవితమ్మ­పై పరోక్షంగా మండిపడ్డారు.

అనంతరం పార్టీ జిల్లా నేతలు ఎన్‌టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేయడానికి పైకి వెళ్లగానే.. బస్సు ముందు నిలబడి ఉన్న ఇరువర్గాలు కేకలు వేస్తూ బాహాబాహీకి దిగారు. గందరగోళం నెలకొంది. ఏం జరుగుతోందో అర్థంగాక కార్యకర్తలు ఆందోళనకు గురయ్యారు. పోలీసులు వెంటనే రంగప్రవేశం చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. అక్కడి నుంచి బస్సుయాత్ర అంబేడ్కర్‌ సర్కిల్‌కు వెళ్లగా సవితమ్మ వర్గీయులు మాత్రం కార్యా­లయం వద్దే ఉండిపోయారు. 

Videos

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)