Breaking News

భారత్‌ జోడో న్యాయ్‌ యాత్రపై కేసు నమోదు

Published on Fri, 01/19/2024 - 11:58

దిస్‌పూర్‌: కాంగ్రెస్‌ అగ్రనేత, ఎంపీ రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో న్యాయ్‌ యాత్రపై కేసు నమోదు అయ్యింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల్ని ఉల్లంఘించారంటూ కేసు నమోదు చేశారు అసోం పోలీసులు. అసోం ముఖ్యమంత్రిపై రాహుల్‌ గాంధీ తీవ్ర విమర్శలతో విరుచుకుపడిన కొద్దిగంటలకే ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం.

నిర్దేశించిన మార్గంలో కాకుండా.. మరో మార్గం గుండా గురువారం మధ్యాహ్నాం రాహుల్‌ యాత్ర సాగిందన్నది అసోం పోలీసుల అభియోగం. హఠాత్తుగా యాత్ర సాగే దారిని మార్చడం ద్వారా.. జనాలు ట్రాఫిక్ బారికేడ్లను బద్దలు కొట్టారు. అలాగే.. విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందికి దాడికి పాల్పడ్డారని అసోం పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. 
ఈ మేరకు జోడో న్యాయ్‌ యాత్ర నిర్వాహకుడు కేబీ బైజూపైనా కేసు నమోదు అయ్యింది. అంతకు ముందు.. 

అసోం సీఎం హిమంత బిస్వా శర్మపై రాహుల్‌ గాంధీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేశంలోనే అత్యంత అవినీతిపరుడైన ముఖ్యమంత్రి అంటూ ఆరోపణలు గుప్పించారు. ఇదిలా ఉంటే.. శుక్రవారంతో భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర ఆరో రోజుకి చేరింది. ఇవాళ అతిపెద్ద మంచి నీటి ద్వీపం మజూలీలో రాహుల్‌ యాత్ర సాగనుంది. జనవరి 25వ తేదీ దాకా రాహుల్‌ అసోంలోనే యాత్రలో పాల్గొంటారు.

Videos

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి