Breaking News

నేను ఎందుకు అరెస్ట్‌ అయ్యానో మీకు తెలుసా?: కేజ్రీవాల్‌

Published on Wed, 10/16/2024 - 21:21

ఢిల్లీ :  మాజీ సీఎం, ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ బీజేపీపై మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. మేం అందిస్తున్న ప్రజా సంక్షేమాన్ని అడ్డుకునేందుకే తనని అరెస్ట్‌  చేయించిందని మండిపడ్డారు.

వచ్చేడాది ప్రారంభంలో ఢిల్లీలో 70 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా 'జన్ సంపర్క్' పేరిట కేజ్రీవాల్‌ తన ఎన్నికల ప్రచారాన్ని బుధవారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీలో తమ ప్రభుత్వం అందిస్తున్న ప్రజా సంక్షేమాన్ని అడ్డుకునేందుకు బీజేపీ పన్నిన రాజకీయ కుట్రలో భాగంగా తన అరెస్ట్‌ జరిగిందన్నారు. పనిలో పనిగా తన అరెస్ట్,ఐదునెలల జైలు జీవితంపై గురించి ప్రజల్లోకి వెళ్లేలా ఓ లేఖను సిద్ధం చేసినట్లు చెప్పారు. ‌  

‘నేను ఒక లేఖను సిద్ధం చేశాను. మా కార్యకర్తలు ఆ లేఖతో ఢిల్లీలో ప్రతి ఇంటికీ వెళతారు. నన్ను ఎందుకు అరెస్టు చేశారనేది ఈ లేఖ చెబుతుంది. కొందరు చెప్పినట్లు అవినీతి వల్ల కాదు, ఢిల్లీ ప్రజల కోసం మేము చేస్తున్న పనిని ఆపడానికి’ బీజేపీ చేసిన ప్రయత్నమేనని అన్నారు.

ఆప్‌ కార్యకర్తలు ఈ లేఖతో ఢిల్లీ అంతటా ఇంటింటా ప్రచారం చేస్తారు. తన ఐదు నెలల జైలు జీవితం వెనుక అసలైన కారణాల్ని వివరించి వారికి  లేఖను అందిస్తాం. మరోసారి ఆప్‌ కొనసాగేలా ఓటర్లను కోరనున్నట్లు తెలిపారు. ఈ ప్రచారం అక్టోబర్ 29 వరకు కొనసాగుతుందని చెప్పారు.  

ఢిల్లీలో గత మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ని విజయపథంలో నడిపించిన  తాను ఎప్పుడూ అవినీతికి పాల్పడలేదని పునరుద్ఘాటించారు. ‘కేజ్రీవాల్ అవినీతి చేయలేరని అందరికీ తెలుసు. ఢిల్లీవాసుల కోసం ఉచిత విద్యుత్, ఉచిత నీరు, మొహల్లా క్లినిక్‌లు, నాణ్యమైన ప్రభుత్వ పాఠశాలల కోసం మేం చేస్తున్న అభివృద్ధిని  ఆపాలని కోరుకున్నారు కాబట్టే అరెస్ట్‌ చేశారు. 

బీజేపీ అధికారంలోకి వస్తే, వారు చేసే మొదటి పని ఏంటో తెలుసా? మీకు అందించే ఉచిత విద్యుత్తును నిలిపివేయడం. ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రులను నాశనం చేయడం, దీర్ఘకాలిక  కరెంట్‌ కోతలతో మిమ్మల్ని ఇబ్బంది పెడతారు’ అంటూ ఢిల్లీ ప్రజలను ఉద్దేశిస్తూ కేజ్రీవాల్‌  ప్రసంగం చేశారు.

Videos

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)