Breaking News

అల్లుడి బాగోతం అత్తగా నాకే తెలుసు: లక్ష్మీపార్వతి

Published on Mon, 02/19/2024 - 12:11

విజయవాడ, సాక్షి:  చంద్రబాబు ఆడవాళ్లను అస్యహించుకుంటే.. అయితే మహిళకు సాధికారతతో సమాజం వృద్ధి చెందుతుందని సీఎం జగన్‌ బలంగా నమ్మారని తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి అన్నారు. సోమవారం ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘జగన్ పాలన - మహిళ స్పందన’ రాష్ట్రస్థాయి మహిళా సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. 

రామ్ మనోహర్ లోహియా మహిళా పక్షపాతి.. అలాగే వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి మహిళా సంస్కర్త. ఇందిరాగాంధీ మహిళల స్థితి గతులు తెలుసుకునేందుకు
రామచంద్రగుహ కమిటీ వేశారు. ఆ కమిటీ ఓ నివేదిక ఇచ్చింది. 16 ఏళ్ల ఇందిరాగాంధీ పాలనలో కూడా మహిళల స్థితిగతులు మారలేదు.. ఆ కమిటీ నివేదిక ఇచ్చినా ఇబ్బందులు తొలగిపోలేదు. అలాంటిది.. ఇందిరాగాంధీ చేయలేని పనిని సీఎం జగన్‌ చేసి చూపించారు 

ఓ మహర్షిలా జగన్‌.. 
.. మహిళలకు ఆస్తిహక్కు కల్పించిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కింది. మహిళల కోసం తొలిసారిగా పద్మావతి యూనివర్శిటీని స్థాపించారాయన. అలాగే.. మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించారు. ఎన్టీఆర్ తర్వాత మహిళల సాధికారితకు కృషి చేసింది వైఎస్సార్.. ఇప్పుడు వైఎస్ జగన్. దేశంలో మహిళలకు అన్నిరంగాల్లో పెద్దపీట వేస్తున్న ఏకైక సీఎం జగన్‌ ఒక్కరే. అందుకే ప్రజలు మంచి మనసుతో ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలి..  

జగన్‌మోహన్‌రెడ్డి ఒక వ్యవస్థ. వయసులో చిన్నవాడే అయినా ఆయన ఆలోచనలు చాలా గొప్పగా ఉంటాయి. అణగారిన వర్గాలకు గుర్తింపునిచ్చిన వ్యక్తి. పేదలు...మహిళల అభ్యున్నతికి ఒక మహర్షిలా పాటు పడుతున్నారు.  భారతదేశ చరిత్రలో విద్యకు ఇంత ప్రాధాన్యం ఇచ్చిన ఒకే ఒక్కరు జగన్. అందుకే జగన్ చేస్తున్న మంచి పనులను మనమంతా అందరికీ చెప్పాలి. రాబోయే 15 ఏళ్లపాటు ఇదే ప్రభుత్వం ఉంటే ప్రపంచంలోనే ఏపీ నెంబర్ వన్ గా నిలుస్తుంది 

చంద్రబాబు పనైపోయింది
అల్లుడి బాగోతం అత్తగా నాకే తెలుసు. గత పాలనలో రూ. 6 లక్షల కోట్లు లూటీ జరిగింది.  చంద్రబాబు పనైపోయింది.  ముసలోడైపోయాడు.. మూడుకాళ్లొచ్చేశాయి. అందుకే తన కొడుకుని సీఎం చేయాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడు.  చంద్రబాబు బాధితుల్లో నేను, నాభర్త ఎన్టీఆర్ ముందు వరుసలో ఉంటాం.  చంద్రబాబుకి ఆడవాళ్లంటే అసహ్యం. జగన్‌ను తిట్టడానికే చంద్రబాబు మీటింగ్లు పెడుతున్నాడు. సన్నాసి అయిన లోకేష్‌ కావాలా?.. మంచి వ్యక్తి అయిన జగన్ కావాలో ప్రజలు ఆలోచించాలి. పొరబాటున ప్రభుత్వం మారితే ఏపీ పూర్తిగా దోపిడీకి గురవుతుంది అని ఏపీ ప్రజలను హెచ్చరించారామె. ఈ సమావేశంలో యూనిసెఫ్ ప్రతినిధి బండ్లమూడి రోజారాణి,మారుతీ మహిళా సొసైటీ అధ్యక్షురాలు సునీతా లఖంరాజు, పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)