Breaking News

ఎమ్మెల్యే ఇంట్లోకి చొరబడి.. తాడిపత్రిలో పోలీసుల ఓవరాక్షన్‌

Published on Wed, 05/15/2024 - 13:13

అనంతపురం, సాక్షి: జిల్లాలో పోలింగ్‌ వేళ నుంచి పోలీసులు వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదంగా మారింది. తాజాగా.. తాడిపత్రి నియోజకవర్గంలో పోలీసులు ఓవరాక్షన్‌కు దిగారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లోకి చొరబడిన పోలీసులు వీరంగం సృష్టించారు.

కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లోకి ప్రవేశించిన పోలీసులు.. పని మనుషుల్ని బెదిరించారు. అంతేకాదు.. సీసీ కెమెరాలు, కంప్యూటర్లు, ఫర్నీచర్‌ ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు హార్డ్‌ డిస్క్‌, సీపీయూలను పోలీసులు మాయం చేశారని ఎమ్మెల్యే వర్గీయులు ఆరోపిస్తున్నారు. పోలీసులు ఇంతటితో ఆగలేదు.

తాడిపత్రివ్యాప్తంగా 30 మంది వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఈ పరిణామాలపై ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులపై అక్రమ కేసులు పెడితే సహించేది లేదంటూ హెచ్చరించారాయన.

ఏఎస్పీ రామకృష్ణ సహకారంతో టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి రౌడీయిజం చేస్తున్నారని, పోలీసుల తీరుపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని ఎమ్మెల్యే పెద్దారెడ్డి చెబుతున్నారు. శాంతి భద్రతలకు సహకరించాలనే ఉద్దేశంతోనే తాము తాడిపత్రిని వీడి బయటకు వచ్చామని, అయితే పోలీసులు మాత్రం మరోలా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడుతున్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)