Breaking News

LIVE : ఏపీ పొలిటికల్‌ అప్‌డేట్స్‌

Published on Thu, 02/01/2024 - 07:36

AP Elections Political Latest Updates Telugu..

8:50 PM, Feb 1st, 2024
వెస్ట్‌ పోరు..  జలీల్‌ ఖాన్‌ వార్నింగ్‌

  • విజయవాడ వెస్ట్ లో టీడీపీ నేతల మధ్య ముదురుతున్న వార్
  • బుద్ధా వెంకన్న, జలీల్ ఖాన్ మధ్య టికెట్ కోసం పోటీ
  • సీటు తనదే.. పోటీ చేసేది తానేనంటున్న జలీల్‌ ఖాన్‌
  • మైనారిటీలకు టికెట్ ఇవ్వకపోతే ఉరి వేసుకుంటారో.. ఏం చేస్తారో తెలియదంటూ జలీల్ ఖాన్ వార్నింగ్
  • పొత్తులో భాగంగా ఈ సీటు వదులుకోవాలని పవన్‌కు చెప్పినట్లు జలీల్‌ ఖాన్‌ వ్యాఖ్య
  • విజయవాడ వెస్ట్ టికెట్ కోసం ప్రయత్నిస్తున్న బుద్ధా వెంకన్న 
  • టికెట్ తనకే ఇవ్వాలంటూ బుద్ధా వెంకన్న బల ప్రదర్శన
  • జనసేన సైతం టికెట్‌ కోసం యత్నాలు
  • ఆటలో అరటిపండులా జనసేనను చూస్తున్న టీడీపీ!

8:15 PM, Feb 1st, 2024
పెత్తందారులపై యుద్ధానికి మేం సిద్ధం

  • పల్నాడు జిల్లా వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కామెంట్స్
  • బీసీలకు పెద్ద పీట వేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ది
  • నరసరావుపేట ఎంపీ గా అనిల్ కుమార్ యాదవ్ కి సీటు ఇవ్వటమే ఇందుకు నిదర్శనం
  • మంత్రి వర్గంలో కూడా సామాజిక న్యాయం చేసిన ఘనత ముఖ్యమంత్రిది 
  • పెత్తందారులపై యుద్ధానికి మేం సిద్ధం
  • రానున్న ఎన్నికల్లో 7 అసెంబ్లీ స్థానాలతో పాటు 2 లక్షల మెజారిటీ తో ఎంపీ సీటు ను కూడా గెలవబోతున్నాం 

7:35 PM, Feb 1st, 2024
కొవ్వూరు టీడీపీలో ముసలం

  • తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు టీడీపీలో ముసలం 
  • కేఎస్‌ జవహర్‌కు టికెట్‌ ఇవ్వొద్దంటూ రోడ్డెక్కిన టీడీపీ కార్యకర్తలు
  • గ్రూప్‌ రాజకీయాలు ప్రొత్సహిస్తున్నాడంటూ జవహర్‌పై ఆరోపణలు
  • జవహర్‌కు కాకుండా ఎవరికి ఇచ్చినా ఓకే అంటున్న తెలుగు తమ్ముళ్లు
  • ప్రత్యేకంగా సమావేశమై తీర్మానం చేసిన జవహర్‌ వ్యతిరేక వర్గం
  • వేరే ఎవరికి ఇచ్చినా సమిష్టిగా గెలిపించుకునే ప్రయత్నం చేస్తామంటూ ప్రకటన
  • లేకుంటే.. పరిణామాలు మరోలా ఉంటాయని అధినేత చంద్రబాబుకి సంకేతాలు పంపిన కేడర్‌

7:18 PM, Feb 1st, 2024
పులివెందులో టీడీపీ నేతల నిర్వాకం

  • పులివెందులలో టీడీపీకి షాక్ 
  • పులివెందుల మండలం అహోబిలాపురంలో మాట్లాడాలని వచ్చి వడ్డె కులస్తులకు కండువాలు కప్పిన టీడీపీ నేతలు
  • అనంతరం టీడీపీలో చేరారంటూ సోషియల్ మీడియాలో పోస్టులు
  • పోస్టులు చూసి చిర్రెత్తిపోయిన వడ్డెర కులస్తులు
  • మున్సిపల్ ఛైర్మన్ వరప్రసాద్‌ ఆధ్వర్యంలో తాము వైఎస్సార్‌సీపీలోనే కొనసాగుతున్నామని స్పష్టం చేసిన వడ్డెర కులస్తులు
  • కండువాలు వేసిన వారిపై, నెట్‌లో పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్న వడ్డెర కులస్తులు

6:47 PM, Feb 1st, 2024
కాంగ్రెస్ దేశంలో జెండా ఎత్తేసింది: బీజేపీ ఎంపీ జీవీఎల్

  • ఏపీలో కనుచూపు మేరలో కాంగ్రెస్ లేదు
  • కాంగ్రెస్ పార్టీ వల్లనే రాష్ట్రానికి నష్టం జరిగింది 
  • కాంగ్రెస్‌ను ప్రజలు ఎన్నటికీ క్షమించరు
  • రాజకీయ ఉద్దేశ్యంతో తెలుగు రాష్ట్రాలను కాంగ్రెస్ మోసం చేస్తోంది?
  • పొత్తులపై అంతిమ నిర్ణయం జాతీయ నాయకులు నిర్ణయం తీసుకుంటారు
  • చిరంజీవికి పద్మవిభూషణ్ వెనుక రాజకీయ ఉద్దేశాలు లేవు

5:50 PM, Feb 1st, 2024
లోకేష్‌ న్యాయవాదులపై హైకోర్టు ఆగ్రహం 

  • వ్యూహం సినిమా విడుదలపై హైకోర్టు విచారణ
  • పూర్తి సమాచారం లేకుండా వాదనలా? హైకోర్టు
  • పార్టీ తరఫున పిటిషన్‌ వేసేందుకు లోకేశ్‌కు ఏం అర్హత ఉంది?
  • ఉపాన్యాసాలు, ఉపోద్ఘాతాలు వద్దు.. సబ్జెక్ట్‌పై వాస్తవాలు చెప్పండి
  • ఇంకా సమయం కావాలని కోరడం.. కోర్టు సమయాన్ని వృథా చేయడమే
  • లోకేష్ న్యాయవాదులపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం
  • ‘వ్యూహం’పై వాదనలు పూర్తి... తీర్పు రిజర్వు

4:10 PM, Feb 1st, 2024
టికెట్‌ టెన్షన్‌లో ఉన్నారేమో?.. వరదరాజులుపై రాచమల్లు సెటైర్లు

  • ప్రొద్దుటూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వ్యాఖ్యలు
  • మాజీ ఎమ్మెల్యే వరదరాజులురెడ్డిపై మండిపడ్డ ఎమ్మెల్యే రాచమల్లు 
  • నేను అన్యాయంగా ఒక్క రూపాయి కూడా సంపాదించలేదు
  • సోదరుడు సంపాదించిన డబ్బుతోనే దానధర్మాలు చేశాను
  • వరదరాజులురెడ్డి సంస్కారహీనంగా మాట్లాడుతున్నారు
  • టీడీపీ టిక్కెట్ వస్తుందో లేదోనన్న టెన్షన్లో ఉన్నారు
  • వచ్చే ఎన్నికల్లో గెలుస్తా.. మంత్రిని కూడా అవుతా

4:10 PM, Feb 1st, 2024
షర్మిల అప్పుడేం చేశారు?: పురంధేశ్వరి ఫైర్‌

  • కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు షర్మిలపై బీజేపీ ఏపీ చీఫ్‌ పురంధేశ్వరి విమర్శలు 
  • ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించింది చంద్రబాబు హయాంలోని రాష్ట్ర ప్రభుత్వమే కాదా? 
  • ప్రత్యేక ప్యాకేజీ బాగుందని వెంకయ్య నాయుడికి సన్మానం కూడా చేశారు కదా
  • అప్పుడు ఏం చేశారు? ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారు?
  • ఇప్పుడొచ్చి ప్రత్యేక హోదా గురించి షర్మిల మాట్లాడుతున్నారు 

3:50 PM, Feb 1st, 2024
జగన్ పాలనలో అంతా సంతోషంగా ఉన్నారు - మెట్టు గోవింద రెడ్డి

  • అనంతపురం రాయదుర్గం వైఎస్సార్ సీపీ సమన్వయకర్త, ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టు గోవింద రెడ్డి వ్యాఖ్యలు 
  • సమన్వయకర్త పదవి ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు
  • రాయదుర్గం నియోజకవర్గం లో పార్టీ బలోపేతానికి కృషి చేస్తా
  • సిట్టింగ్ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి విమర్శలు అర్థరహితం
  • సీఎం జగన్ను విమర్శించే అర్హత కాపు రామచంద్రారెడ్డి కి లేదు
  • ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలి
  • వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ప్రభంజనం ఖాయం
  • ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంక్షేమ పథకాలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది
  • ఏపీ ఎన్నికల్లో చంద్రబాబు - పవన్ కల్యాణ్ పొత్తు ప్రభావం ఉండదు
  • జగన్ పాలన లో ప్రజలంతా సంతోషంగానే ఉన్నారు 

3:38 PM, Feb 1st, 2024
జగన్ చెప్పాడంటే...చేస్తాడంతే: మంత్రి జోగి రమేష్‌ 

  • కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం ఆకునూరులో నాల్గవ విడత వైఎస్సార్ ఆసరా సంబరాలు
  • పాల్గొని మీడియాతో మాట్లాడిన మంత్రి జోగి రమేష్
  • వైఎస్సార్ ఆసరాను మహిళలు పండుగలా చేసుకుంటున్నారు
  • జగన్ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారు
  • అవ్వా తాతలకు గడప వద్దకే పెన్షన్ అందిస్తున్నాం
  • 2019 లో ఇచ్చిన అన్ని హామీలు జగన్ అమలు చేశారు
  • 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి .. ఇళ్లు కట్టిస్తున్నాం
  • జగన్ చెప్పాడంటే...చేస్తాడంతే 
  • నాడు నేడు ద్వారా పాఠశాలల రూపురేఖలు మారాయి.
  • విద్య కు జగన్ ప్రాధాన్యత ఇస్తున్నారు
  • చంద్రబాబు మాటలు ప్రజలు నమ్మరు
  • ఎన్టీఆర్ ని చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు
  • మళ్లీ జగన్ ముఖ్యమంత్రి అవడం ఖాయం

3:05 PM, Feb 1st, 2024
చంద్రబాబు చిత్తుగా ఓడడం ఖాయం: ఈరలకప్ప

  • ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నాలాంటి నిరుపేద వాడిని సమన్వయకర్తగా నియమించడం చాలా సంతోషంగా ఉందన్నారు
  • రాష్ట్రంలో టీడీపీ పని అయిపోయింది. నియోజకవర్గాల్లో క్యాండిడేట్ పేర్లను ప్రకటించలేకపోయారు
  • టీడీపీకి రాష్ట్రంలో అభ్యర్థులు కరువయ్యారు
  • ఎన్నికలకు వైఎస్సార్‌సీపీ సిద్ధం.. ప్రతిపక్షాలు సిద్ధమా?
  • 2024 లో చంద్రబాబు ఎన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్న చిత్తుచిత్తుగా ఓడిపోవడం ఖాయం అన్నారు

శ్రీసత్యసాయి జిల్లా మడకశిర వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త ఈరలకప్ప వ్యాఖ్యలు

2:45 PM, Feb 1st, 2024
తెలుగుదేశం.. గందరగోళం

  • టీడీపీ అధిష్టానంలో గందరగోళ పరిస్థితి
  • సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఖరారుపై ఎడతెగని కసరత్తులు
  • నిన్నంతా హైదరాబాద్ చంద్రబాబు చర్చలు
  • నియోజకవర్గాల నేతలు, ఆశావహులకు ఏం చెప్పలేని పరిస్థితుల్లో చంద్రబాబు
  • క్షేత్రస్థాయిలో దిగజారుతున్న పరిస్థితి
  • పొత్తుల కత్తెరలో ఎటూ తేల్చుకోలేకపోతున్న చంద్రబాబు
  • ఏదో ఒకటి తేల్చాలని జనసేన నుంచి ఒత్తిడి
  • ఎన్ని సీట్లు ఇస్తారు? ఎక్కడ చోట్ల పోటీ చేయాలి?
  • తొందరపడి ఇటీవల రెండు సీట్లు ప్రకటించిన చంద్రబాబు
  • పోటీగా తాను రెండు ప్రకటించిన పవన్‌ కళ్యాన్‌
  • రేపు చంద్రబాబు 50 ప్రకటిస్తే.. పవన్‌ కూడా 50 సీట్లు ప్రకటిస్తాడా?
  • ఎన్నికలు సమీపిస్తున్నా.. కసరత్తు చివరి దశకు రాదా?
  • మ్యానిఫెస్టో అటకెక్కినట్టేనా?
  • సీట్లపై పీఠముడి వీడేదెప్పుడు?
  • ఎంపీ స్థానాల విషయంలోనూ ఇదే సందిగ్ధతా?
  • ఇప్పుడు YSRCP ఎమ్మెల్యేలవైపు చూపులెందుకు?
  • క్యాడర్‌కు ఎన్నాళ్లు వెన్నుపోటు పొడుస్తారు?

2:30 PM, Feb 1st, 2024
దారి తప్పిన బెజవాడ సైకిల్‌

  • టికెట్‌ కోసం విజయవాడలో బుద్దా వెంకన్న ర్యాలీ
  • విజయవాడ పశ్చిమ టికెట్ తనకే ఇవ్వాలని బుద్దా డిమాండ్‌
  • ఇన్నాళ్లు పని చేశాను, ఇప్పుడు వెన్నుపోటు పొడవద్దని ఆవేదన
  • ఇప్పటికే విజయవాడ పశ్చిమ వేరే వాళ్లకు ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోందని అసహనం
  • విజయవాడ పశ్చిమ ఇవ్వలేని పరిస్థితుల్లో అనకాపల్లి ఎంపీ టికెట్ ఇవ్వాలంటున్న బుద్ధా

2:20 PM, Feb 1st, 2024
శుభవార్త : కరెంటు ఛార్జీలు పెరగవు

  • ఈ ఏడాది ఏ వర్గం మీద విద్యుత్ ఛార్జీలు పెంచలేదు : ఏపీఈఆర్సీ ఛైర్మన్ నాగార్జున రెడ్డి
  • స్మార్ట్ మీటర్ల వల్ల రైతులకు ఎలాంటి నష్టం లేదు
  • స్మార్ట్ మీటర్ల పై ప్రజలను కొన్ని ప్రతిపక్షాలు గందరగోళానికి గురి చేస్తున్నాయి
  • రైతులకు నాణ్యమైన ఉచిత విద్యుత్ ను ప్రభుత్వం అందిస్తుంది : ఏపీఈఆర్సీ ఛైర్మన్

2:14 PM, Feb 1st, 2024
ESI అక్రమాల కేసులో ACB కోర్టు విచారణ

  • విజయవాడ : ఈఎస్ఐ కేసులో ఏసీబీ కోర్టులో విచారణ
  • రూ. 150 కోట్ల కుంభకోణంలో అచ్చెన్నాయుడి పాత్ర ఉందని అభియోగం
  • కేసులో పీసీయాక్ట్ 19, సీఆర్పీసీ 197 సెక్షన్ నమోదు చేసిన ఏసీబీ
  • పీసీయాక్ట్ 19 ప్రకారం గవర్నర్ అనుమతిపై కోర్టులో విచారణ
  • తదుపరి విచారణను ఈ నెల 6 కు వాయిదా వేసిన ఏసీబీ కోర్టు

2:00 PM, Feb 1st, 2024
అవకాశాలిచ్చాం.. గెలిచి చూపిస్తాం : అంబటి

  • టికెట్ రానందుకే శ్రీకృష్ణదేవరాయలు పార్టీ వీడారన్నది అవాస్తవం : మంత్రి అంబటి రాంబాబు
  • గుంటూరు ఎంపీగా పోటీ చేయాలని సీఎం జగన్‌ సూచించారు
  • శ్రీకృష్ణదేవరాయలు పార్టీ వీడడం సరైన విధానం కాదని వైసీపీ క్యాడర్ అర్ధం చేసుకున్నారు
  • పార్టీ నిర్ణయాన్ని అందరూ గౌరవించాలి
  • నర్సరావుపేట లోక్ సభ పరిధిలో 7 సీట్లు గెలవబోతున్నాం : మంత్రి అంబటి రాంబాబు

1:30PM, Feb 1st, 2024
ధర్మవరంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరీ ఓవర్ యాక్షన్

  • 4 కోట్ల రూపాయల వ్యయం తో మెయిన్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి
  • గుంతలు పూడ్చివేత పేరుతో మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరీ హడావుడి
  • న్యూసెన్స్ క్రియేట్ చేసిన మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరీని అరెస్టు చేసిన పోలీసులు
  • వరదాపురం సూరీ వైఖరిని ఖండించిన ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి
  • నాలుగున్నరేళ్లు వరదాపురం సూరీ ఎక్కడికెళ్లారు? 
  • రోడ్లు వేస్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారు

1:27PM, Feb 1st, 2024

జగన్‌మోహన్‌రెడ్డి పేదల పక్షపాతి: ఎంపీ కేశినేని నాని

  • చంద్రబాబు ధనికుల పక్షపాతి
  • పనికి మాలిన కొడుకు లోకేష్‌ని  చంద్రబాబు మంత్రిని చేశాడు 
  • మీడియా మేనేజ్‌మెంట్‌ చేసి ప్రభుత్వం పై చంద్రబాబు నెగిటివ్ ప్రచారం చేశాడు 
  • చంద్రబాబుకు ఇప్పటికీ ఆంధ్రాలో సొంత ఇల్లు లేదు
  • రానున్న ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు అమ్ముకోవటమే లక్ష్యంగా  చంద్రబాబు పనిచేస్తున్నాడు
  • 2014,19 లో నేను ఉంటేనే తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గెలిచాడు
  • నేను లేకపోతే ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ జీరో
  • 25వేల మెజారిటీ తో అవినాష్ గెలవబోతున్నాడు

1:25PM, Feb 1st, 2024

సీఎం జగన్‌ను గెలిపించుకునేందుకు ప్రజలు మేము సైతం అంటున్నారు: ఎమ్మెల్యే వాసుబాబు

  • 110 ఎకరాల సభా ప్రాంగణంలో 50 నియోజకవర్గాల నుండి లక్షలాది మంది క్యాడర్ తరలి రాబోతున్నారు
  • 2019 ఎన్నికల్లో 51 శాతం ఓట్లతో 151 సీట్లు ఇచ్చిన క్యాడర్ 175 సీట్లు ఇచ్చేందుకు తరలి రాబోతున్నారు
  • 150 ఎకరాల ప్రాంగణంలో సైతం పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేశారు
  • ఇచ్చిన హామీలను నూటికి నూరు శాతం నెరవేర్చిన నాయకుడు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి
  • ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రజల సిద్ధంగా ఉన్నారు
  • భీమిలి సభకు మించి గోదావరి జిల్లాలో సభ జరగబోతుంది
  • చంద్రబాబు మాట అబద్ధపు మూట
  • అబద్దాలు మేడలు కట్టడంలో చంద్రబాబు ముందు ఉంటాడు

01:20PM, Feb 1st, 2024

‘ఆంధ్రప్రదేశ్‌కి జగనే ఎందుకు కావాలి’ కార్యక్రమం లో ఎమ్మెల్యే భూమన

  • 3లక్షల 40 వేల కోట్లు రూపాయలు రాష్ట్ర ప్రజలకు అందించారు సీఎం జగన్
  • పేదలు  జీవితాల్లో ఆనందం నిజమైన అభివృద్ధి
  • అభివృద్ధి అంటే ఫ్యాక్టరీలు, కంపెనీలు కాదు, పేదలు జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపడం
  • 70 రోజుల్లో ఎన్నికలు జరుగనున్నాయి
  • మీకు డబ్బులు ఇవ్వ్వద్దు అంటున్న వాడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్
  • డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు రుణ మాఫీ చేస్తామని మాయ మాటలతో మోసం చేసినవాడు చంద్రబాబు
  • సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అమ్మఒడి, జగనన్న విధ్యా దీవెన, వసతి దీవెన ఇచ్చిన పేద పిల్లలకు బంగారు భవిష్యత్‌కు బాటలు వేస్తున్నారు
  • రానున్న ఎన్నికలు పెద్దవాళ్ళకు చంద్రబాబు మధ్య యుద్ధం
  • చంద్రబాబుకి ఓటు వేస్తే ఈ పథకాలు అన్ని ఆగిపోతాయి
  • ఒక విజన్ ఉన్న నాయకుడు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి
     

01:16PM, Feb 1st, 2024

పల్నాడు జిల్లా:

నరసరావుపేట పార్లమెంట్ వైఎస్సార్‌సీపీ అభ్యర్ధిగా అనిల్ కుమార్ యాదవ్‌ను ప్రకటించడం పట్ల బీసీ వర్గాల్లో ఆనందం:
అంబటి రాంబాబు 

  • ఏడు నియోజవర్గాలతో  పాటు పార్లమెంట్‌ను కూడా గెలిపించాలి.
  • త్వరలో అనిల్ అన్ని నియోజకవర్గాల్లో తిరుగుతారు
  • శ్రీ కృష్ణ దేవారయలు అలిగి వెళ్లారని ప్రచారం జరిగింది
  • గుంటూరు పార్లమెంటుకు పోటీ చేయమని జగన్ చెప్పారు.
  • టిక్కెట్టు ఇవ్వలేదని ప్రచారం చేశారు.
  • గుంటూరు ఇస్తానని చెప్పారు.
  • రాజకీయాలలో ముఖ్యమంత్రి చెప్పిన పని చేయాలి.
  • నేను గుంటూరు అడిగాను, సత్తెనపల్లి ఇచ్చారు.
  • పార్టీ ఎక్కడ టిక్కెట్ ఇస్తే అక్కడ నిలబడాలి.
  • శ్రీ కృష్ణ దేవరాయలు పార్టీ వదిలి వెళ్లడం కారెక్టర్ కాదు

01:05PM, Feb 1st, 2024

ఏలూరు జిల్లా :

రాష్ట్రం నలుమూలల నుంచి  ఒకే నినాదం... మేం సిద్ధం: ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి

  • జగనన్నను ముఖ్యమంత్రి పీఠంలో రెండోసారి కుచ్చుపెట్టేందుకు మేము సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ప్రజలు అంటున్నారు
  • దెందులూరు నియోజకవర్గంలో జన సునామీ చూడబోతున్నారు
  • రాష్ట్రానికి రారాజు జగన్‌మోహన్‌రెడ్డి
  • ప్రతిపక్షాలు తిరువూరులో నాలుగు ఎకరాల్లో, తూర్పుగోదావరి జిల్లాలో 5 ఎకరాల్లో.. సభలు పెట్టారు
  • జనహృదయ నేత పేదల పక్షపాతి వచ్చినప్పుడు జనం తండోపదండాలుగా వస్తారు
  • 110 ఎకరాల్లో కనివిని ఎరగని రీతిలో సభ జరగబోతుంది
  • ప్రతి వైఎస్సార్‌సీపీ కార్యకర్తకూడా జగనన్న రాకకోసం  సిద్ధంగా ఉన్నాం...
  • చంద్రబాబు చెప్పే మాటలు నమ్మే పరిస్థితిలో ప్రజలులేరు
  • మాయమాటలు చెప్పి ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నాడు చంద్రబాబు
  • కలయికలతో వచ్చే  పార్టీల మేనిఫెస్టో ఏంటి...? ఎజెండా ఏమిటి...?

12:16PM, Feb 1st, 2024

పార్ట్‌ టైం పొలిటీషియన్స్‌.. టెంపరరీ డెలిగేట్స్‌

  • టీడీపీలో పలువురు ఎన్నికల వేళ మాత్రమే ప్రత్యక్షం
  • బీఫాం తీసుకునే ముందు హడావుడి
  • ఓడినా..గెలిచినా నియోజకవర్గ ప్రజలను పట్టించుకోరు
  • టీడీపీ అంటే ‘టెంపరరీ డెలిగేట్స్‌ ఇన్‌ పార్టీ’అంటున్న ప్రజలు 

12:00PM, Feb 1st, 2024

ఇరకాటంలో టీడీపీ పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు 

  • ఎన్‌ఆర్‌ఐలు, గ్రానైట్‌ వ్యాపారులు సమకూర్చిన నల్లధనంతో ఎన్నికల అక్రమాలు 
  • కేసు నమోదుచేసి విచారణ ప్రారంభించిన  పోలీసులు 
  • నల్లధనం వ్యవహారాలు వెలుగు చూస్తాయని అనుచరుల్లో భయం 
  • ఏలూరి అక్రమాల్లో ఇరుక్క పోయామని ఆందోళన 

11:30AM, Feb 1st, 2024

విజయవాడ: 
చంద్రబాబు ప్యాకేజీ కోసం పవన్ కళ్యాణ్ ఎదురుచూస్తున్నాడు: ఎమ్మెల్యే వెల్లంపల్లి

  • 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబుకు దత్తపుత్రుడు ఎప్పుడూ పక్కనే ఉంటాడు
  • దొంగ నాటకాలు చేయటంలో పవన్ కళ్యాణ్ దిట్ట
  • చంద్రబాబు ప్యాకేజీ కోసం పవన్ కళ్యాణ్ ఎదురుచూస్తున్నాడు
  • పవన్ కళ్యాణ్ అజెండా చంద్రబాబు జెండా మోయడమే
  • చంద్రబాబు అజెండా లోకేష్ ని ముఖ్యమంత్రి చేయడమే
  • చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు చేసినా ఎవరూ నమ్మరు
  • మాజీ టీడీపీ ఎమ్మెల్యే సూర్యుడిని చంద్రుడిని చూడలేడు
  • త్వరలోనే బోండా ఉమాకు సూర్యుడిని చూపిస్తా
  • బోండా ఉమా ఆటలు ఇక సాగవు
  • బోండా ఉమా చేసిన దందాలు ఒక్కొక్కటి బయటికి వస్తున్నాయి
  • కబ్జాలకు రౌడీయిజాలకు పాల్పడితే బోండా ఉమాకు తాటతీస్తా
  • 2014లో ఎమ్మెల్యేగా ఉండి ఆర్‌యుబీ ఎందుకు పూర్తి చేయలేకపోయాడు
  • విదేశాలకు వెళ్లి పేకాట క్యాసినో  ఆడే ఉమాకు అభివృద్ధి గురించి ఏం తెలుసు
  • సెంట్రల్ నియోజకవర్గం అభివృద్ధి గురించి ప్రతిపక్ష నాయకుడిగా ఎప్పుడైనా పోరాటం చేశాడా..?
  • బోండా ఉమా కొడుకులు బైక్ రేసుల్లో అమాయకులైన విద్యార్థులను చంపేశారు.
  • మాజీ ఇంటెలిజెన్స్ డిజి వెంకటేశ్వర రావు ద్వారా పోలీసు వ్యవస్థని చంద్రబాబు వాడుకున్నాడు.
  • పోలీసు వ్యవస్థ గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు
  • సీఎం జగన్ పోలీస్ వ్యవస్థని నియంత్రణ చేసుంటే చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ పాదయాత్రలు చేసేవారా?
  • సీఎం జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల్లో 10 శాతమైనా చేశావా చంద్రబాబు

11:05AM, Feb 1st, 2024

టీడీపీకి సోషల్‌ మీడియా తలనొప్పి

  • ‘కోటంరెడ్డి రాసలీలలు’ అంటూ వాయిస్‌ వైరల్‌
  • అజీజ్‌ వర్గం పనేనన్న భావనలో కోటంరెడ్డి
  • కోటంరెడ్డి, అజీజ్‌ల మధ్య రగులుతున్న విభేదాలు

10:45AM, Feb 1st, 2024

బీజేపీ ఒంటరి పోరు

  • ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాల్లోనూ పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న బీజేపీ
  • రాష్ట్రవ్యాప్తంగా  నేడు(గురువారం) 25 లోక్‌సభ స్థానాల పరిధిలో పార్టీ ఎన్నికల కార్యాలయాలు ప్రారంభించనున్న బీజేపీ
  • ‘రాష్ట్రంలో ఒక్క అవకాశం – కేంద్రంలో మరో విడత’ నినాదంతో ముందుకు

10:34AM, Feb 1st, 2024

బాబును నమ్మి మునిగిన భూమా అఖిలప్రియ!

  • కుటుంబంలో రచ్చకెక్కిన విభేదాలు
  • అఖిలప్రియకు మద్దతు ఇవ్వబోమంటున్న సోదరుడు కిశోర్‌రెడ్డి 
  • కుటుంబ కలహాల నేపథ్యంలో టికెట్‌ నిరాకరించే యోచనలో చంద్రబాబు
  • పొత్తులో భాగంగా జనసేనకు సీటు ఇస్తారంటూ లీకులు 
     

9:59AM,Feb 1st, 2024

ఎన్నికల్లో ప్రజలు నన్ను తిరస్కరిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: చంద్రబాబు

  • జాతీయ చానల్‌ రిపబ్లిక్‌ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చంద్రబాబు
  • ఎన్నికలపై చంద్రబాబుకు అపనమ్మకం
  • ఎన్ని పొత్తులు పెట్టుకున్నా గెలవడం కష్టమని నిర్ధారణకు వచ్చిన చంద్రబాబు
  • సొంత పార్టీతో కాదని దత్త పుత్రుడిని కలుపుకున్నా చేకూరని సత్తువ
  • గెలవడం కష్టం అన్న నిర్వేదంలో సానుభూతి ప్రయత్నాలు చేస్తున్న చంద్రబాబు

08:40 AM, Feb 1st, 2024
పచ్చ బ్యాచ్‌ ఇప్పటికైనా ఒప్పుకోండి..
ప్రతీ ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందాలన్నదే సీఎం జగన్‌ లక్ష్యం.
టీడీపీ హయాంలో మాదిరిగా కొందరికే కాదు. 
చెప్పిన మాట మీద నిలబడిన సీఎం జగన్‌
కులం చూడం…
మతం చూడం…
‘పార్టీ చూడం’…
రాజకీయాలు చూడం…
రాజకీయాలు చేయం…
అర్హులైతే చాలు పథకాలు అందుతాయి. 

07:40 AM, Feb 1st, 2024
టీడీపీ, జనసేనకు సజ్జల కౌంటర్‌

  • 175 స్థానాల్లో పోటీకి వైఎస్సార్‌సీపీ సిద్ధం
  • అందుకే ఎన్నికలకు సిద్ధమని మేము ఫ్లెక్సీలు పెడుతున్నాం
  • మరీ 175 స్థానాల్లో పోటీ చేయడానికి టీడీపీ, జనసేన సిద్దంగా ఉన్నారా?. 

07:15 AM, Feb 1st, 2024
ఇంతకీ పోటీ ఎక్కడ పవనూ?

  • ఈ ఎన్నికల్లో పోటీ చేయనున్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌!
  • పోటీ ఎక్కడి నుంచి అనేదానిపై లేని క్లారిటీ
  • జనసేనాని పోటీ ఎక్కడి నుంచో అని జనసేన శ్రేణుల్లో ఉత్కంఠ
  • గత ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి పవన్‌ పోటీ
  • రెండింటిలోనూ ఓడిన పవన్‌ కల్యాణ్‌
  • గాజువాక, భీమవరంలలో ఓడిపోవడానికి టీడీపే కారణమంటూ అప్పట్లో మండిపడ్డ జనసైనికులు
  • పొత్తు వంకతో ఇప్పటికే అభ్యర్థుల్ని ప్రకటించుకుంటూ పోతున్న టీడీపీ
  • పొత్తు ధర్మం పక్కనపెట్టినందుకు కౌంటర్‌ రియాక్షన్‌ ఇవ్వాలంటూ పవన్‌పై ఒత్తిడి
  • ఈ క్రమంలోనే రెండు స్థానాల ప్రకటన
  • అయినా లెక్క చేయని టీడీపీ అధినేత చంద్రబాబు

07:00 AM, Feb 1st, 2024
వైఎస్సార్‌సీపీ ఐదో జాబితా విడుదల

  • మార్పులు చేర్పులతో మరో జాబితా విడుదల చేసిన వైఎస్సార్సీపీ
  • ప్రకటించిన మంత్రి బొత్స, సజ్జల
  • నాలుగు ఎంపీ స్థానాలకు, మూడు ఎమ్మెల్యే నియోజకవర్గాలకు సమన్వయకర్తల్ని మార్చేసిన వైఎస్సార్‌సీపీ
  • రీజినల్‌ కో ఆర్డినేటర్‌ విజయసాయిరెడ్డికి అదనంగా గుంటూరు పార్లమెంట్‌ బాధ్యతలు
  • చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి ఒంగోలు పార్లమెంట్‌ బాధ్యతలు.. అదనంగా కందుకూరు, సంతనూతలపాడు, కావలి అసెంబ్లీ నియోజకవర్గాలకు రీజినల్‌ కోఆర్డినేటర్‌గా నియామకం

06:30 AM, Feb 1st, 2024
ఆ నలుగురికి మళ్లీ నోటీసులు

  • వైఎస్సార్‌సీపీ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలకు మరోసారి అసెంబ్లీ స్పీకర్‌ నోటీసులు 
  • ఉండవల్లి శ్రీదేవి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆనం రాంనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి నోటీసులు పంపిన శాసనసభ అధికారులు
  • ఫిబ్రవరి 5 లోపు నోటీసులపై లిఖిత పూర్వకంగా సమాధానం ఇవ్వాలని కోరిన స్పీకర్‌ 
  • ఫిబ్రవరి 8 తేదీ ఉదయం 11 గంటలకు స్పీకర్ ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశం
  • మంగళవారం సాయంత్రం నోటీసులు పంపిన స్పీకర్‌ కార్యాలయం
  • వివరణ విషయంలో వాళ్లు సీరియస్‌గా లేకపోవడంతో..  బుధవారం కూడా మరోసారి నోటీసుల పంపిణీ!
  • ప్రభుత్వ చీఫ్ విప్ ప్రసాదరాజు అనర్హత పిటిషన్‌ నేపథ్యంలో వివరణ కోరిన స్పీకర్‌ తమ్మినేని సీతారాం
  • గత విచారణలో గడువు కోరిన ఎమ్మెల్యేలు
  • ప్రసాదరాజు సమక్షంలోనే ఆ నలుగురిని ప్రశ్నించనున్న స్పీకర్‌
  • వివరణ తర్వాతే అనర్హత వేటుపై నిర్ణయం వెల్లడించే అవకాశం.

Videos

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు