Breaking News

వైఎస్సార్‌సీపీ విజయోత్సవ సంబరాలపై ‘కూటమి’ కేసులు

Published on Fri, 03/28/2025 - 18:36

తిరుపతి : ఏపీలో  రెడ్ బుక్ రాజ్యాంగాన్ని రెచ్చిపోయి మరీ అమలు చేస్తోంది కూటమి ప్రభుత్వం. వైఎస్సార్‌సీపీ విజయోత్సవ సంబరాలు చేసుకున్న క్రమంలో కూడా కేసు నమోదు చేశారంటే ఏపీ ప్రభుత్వం తీరు ఎలా ఉందో అందరికీ అర్ధమవుతోంది. నిన్న( గురువారం) తిరుపతి రూరల్ ఎంపీపీ స్థానాన్ని వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకున్న అనంతరం సంబరాలు చేసుకున్నారు.  దీనిపై కేసు నమోదు చేశారు ఏపీ పోలీసులు.ఎన్నికల కోడ్ ఉల్లంఘన అంటూ  కేసు  నమోదు చేశారు. ఎస్ఐ కృష్ణయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. చెవిరెడ్డి మోహిత్‌ రెడ్డితో పాటు 9 మందిపై కేసు నమోదు చేశారు యూనివర్శిటీ పోలీసులు.

పోలీసుల తీరుపై ప్రజలు నవ్వుతున్నారు..
వైఎస్సార్‌సీపీ విజయోత్సవ సంబరాలు చేసుకుంటే కేసులు నమోదు చేయడాన్ని చంద్రగిరి పార్టీ ఇంచార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఖండించారు. టీడీపీ తరఫున పసుపు చొక్కాలు వేసుకుని పోలీసులు పని చేస్తున్నారని మండిపడ్డారు.  పోలీసుల తీరుపై ప్రజలు నవ్వుతున్నారన్నారు. పోలీసుల తీరుపై హైకోర్టు ఇటీవల వ్యాఖ్యలు చేసినా వీరిలో మార్పు రావడం లేదన్నారు మోహిత్ రెడ్డి. ఎవరో మెప్పు కోసం పోలీసులు పని చేస్తున్నారని,  తప్పుడు కేసులు పెడుతున్నారన్నారు. ఇంకా ఏమన్నారంటే..

‘37 మంది ఎంపీటీసీ ఉంటే 34 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపు ఉన్నారు..ఎంపీపీ ఎన్నికల్లో విజయం సాధించాం. మా ఎంపీటీసీలను ప్రలోభాలకు గురి చేశారు, ఎక్కడా తలొగ్గలేదు. జై జగన్ జైజై జగన్ అంటూ నినాదాలు చేస్తే వారిపై కేసు నమోదు చేస్తారా?, మా నాన్నగారిపై 88 కేసులు పెట్టారు. నాపై 4వ కేసు పెట్టారు.. నాపై మరో 40 కేసులు పెట్టిన ఎక్కడ వెనక్కి తగ్గేది లేదు. ఈ కూటమి ప్రభుత్వం పై అరాచకాలు పై మా పోరాటం కొనసాగుతుంది. జై జగన్ నినాదాలు చేసినందుకే కేసులు పెట్టడం ఆశ్చర్యం గా ఉంది..

చంద్రగిరి ఎమ్మెల్యే ప్రస్టేషన్ లో ఉన్నారు..వాళ్ళు చేసిన  భూ ఆక్రమణలు బయట పడుతున్నాయి, ప్రజలు నిలదీస్తున్నారు. ఇదే తప్పుడు కేసులు కొనసాగితే.. జిల్లా ఎస్పీ కార్యాలయం ముట్టడిస్తాం, జిల్లాకు వచ్చే మంత్రిని కూడా వదిలి పెట్టం ప్రతి చోటా అడ్డుకుని నిరసన తెలుపుతాం’ అని మోహిత్ రెడ్డి హెచ్చరించారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)