Breaking News

వైఎస్సార్‌సీపీదే ఘన విజయం.. ఏపీలో ఎన్నికలపై సర్వేలు ఇలా..

Published on Thu, 02/29/2024 - 12:41

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ ప్రభంజనం ఖాయమని ఇప్పటికే పలు సర్వేలు వెల్లడించాయి. ప్రతిపక్షాలు ఎన్ని పొత్తులతో కలిసి వచ్చినా ప్రజలు మాత్రం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెంటే ఉన్నామని సర్వేల్లో చెబుతున్నారు. ఏపీలో ఎన్నికలకు సంబంధించి తాజాగా మరో రెండు సర్వేలు కూడా వెల్లడించాయి. వీటిల్లో కూడా వైఎస్సార్‌సీపీదే ఘన విజయమని చెప్పుకొచ్చాయి. 

పేదలకు ఆలంబనగా నిరంతరాయంగా కొనసాగుతున్న సంక్షేమ పథకాలు, జనాభాలో దాదాపు 90 శాతం మందికి నేరుగా అందుతున్న నగదు, అవినీతికి తావులేని స్వచ్ఛమైన పారదర్శక పాలన.. జనాదరణను మరింతగా పెంచాయని వైఎస్సార్సీపీ నమ్ముతోంది. అందుకే 175 అసెంబ్లీ స్థానాల్లోనూ విజయం సాధించడం అసాధ్యమేమీ కాదని ఆ పార్టీ ముందునుంచీ చెబుతోంది. తమకు క్షేత్రస్థాయిలో పరిస్థితి తెలుసు కాబట్టే ‘వైనాట్‌ 175’ అంటున్నామని సీఎం జగన్‌, పార్టీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఇక, తాజాగా జీన్యూస్‌ మ్యాటరైజ్‌ పోల్‌ సర్వే ప్రకారం..
లోక్‌సభ స్థానాలు..
YSRCP-19
TDP-6
BJP-0
INC-0

జానాధార్‌ ఇండియా సర్వే ప్రకారం.. 
అసెంబ్లీ స్థానాలు..
YSRCP- 125(49.2%)
TDP+- 50(46.3%)
BJP-0(1.1%)
INC-0(1.3%)

లోక్‌సభ స్థానాలు..
YSRCP- 17
TDP+- 8
BJP-0
INC-0

►ఇదే సమయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పనితీరుపై ప్రజలు ఎంతో విశ్వాసం ఉంచారు. సీఎం జగన్‌ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల పట్ల తాము సంతృప్తిగా ఉన్నట్టు చెప్పారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి జగన్‌ పనితీరు బాగుందని దాదాపు 62 శాతం ప్రజలు మద్దతిచ్చారు. 

►అంతకుముందు.. ప్రముఖ వార్తా చానల్‌ టైమ్స్‌ నౌ సర్వే కూడా ఏపీలో ఫలితాలపై సర్వేను వెల్లడించింది. ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే పార్టీ క్లీన్‌స్వీప్‌ చేయడం ఖాయమని పేర్కొంది. వైఎస్సార్‌సీపీ 24 నుంచి 25 స్థానాలు గెలుస్తుందని టౌమ్స్‌ నౌ–ఈటీజీ చేసిన సర్వే తేల్చింది. టీడీపీ ఒక్క స్థానంలో మాత్రమే గెలిచే అవకాశం ఉన్నట్టే సర్వేలో పేర్కొంది. 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)