మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?
Breaking News
ఏపీ బీజేపీ కొత్త బాస్‌గా PVN మాధవ్
Published on Mon, 06/30/2025 - 11:36
బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక కసరత్తు ఓ కొలిక్కి వచ్చింది. మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ వైపు మొగ్గు చూపించింది అధిష్టానం. దీంతో ఈ మధ్యాహ్నాం ఆయన నామినేషన్ దాఖలు చేశారు.
సాక్షి, విజయవాడ: ఏపీ బీజేపీ అధ్యక్ష పదవికి ఇవాళ నామినేషన్స్ జరుగుతున్నాయి. అంతకు ముందు అధిష్టానం ఏకగ్రీవంగా పీవీఎన్ మాధవ్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. అయితే రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో సంప్రదాయబద్దంగా జరగనున్న ప్రక్రియలో భాగంగా.. సోము వీర్రాజు, జీవీఎల్‌తో కలిసి మాధవ్ నామినేషన్ దాఖలు చేశారు. రేపు ఉదయం మాధవ్ పేరును ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.
పీవీఎన్ మాధవ్.. పూర్తి పేరు పోకల వంశీ నాగేంద్ర మాధవ్. 1973 ఆగస్టు 10న ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లా మద్దిలపాలెంలో జన్మించారు. 2017లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఎన్నికల్లో పట్టభద్రుల నియోజకవర్గం నుండి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. మండలిలో ఆ పార్టీ ఫ్లోర్ లీడర్‌గానూ ఆయన వ్యవహరించారు. ఆయన పదవీకాలం 2019 మార్చి 30 నుండి 2025 మార్చి 29 వరకు కొనసాగింది. అయితే..
ఈ మధ్యలో.. 2023లో జరిగిన శాసనమండలి ఎన్నికల్లో ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా మళ్లీ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. రాజకీయ జీవితానికి తోడు సామాజిక కార్యక్రమాల్లోనూ మాధవ్ చురుకుగా పాల్గొంటారు. 2024లో విశాఖపట్నంలో జరిగిన "ఆర్గానిక్ మేళా"ను నిర్వహించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.
Tags : 1