Breaking News

పవన్‌ ‘బ్రో’ సీన్‌పై మంత్రి అంబటి రియాక్షన్‌

Published on Sat, 07/29/2023 - 10:38

సాక్షి, పల్నాడు: రెండు నావల మీద ప్రయాణం కొనసాగిస్తున్న పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌.. ఈ మధ్యకాలంలో తన సినిమాల్లోనూ రాజకీయాల ప్రస్తావన కచ్చితంగా ఉంటోంది. అవసరం ఉన్నాలేకున్నా.. సందర్భం కాకున్నా కొన్ని సీన్లలో ‘అక్కడ స్పేస్‌ తీసుకుని మరీ’ డైలాగులు ఉండేలా చూసుకుంటున్నాడు. ఇందుకుగానూ  ప్రాసలు-పంచులనే నమ్ముకున్న త్రివిక్రమ్‌ లాంటి సోకాల్డ్‌  రైటర్‌ సేవలను ఉపయోగించుకుంటున్నాడు కూడా.

ఈ క్రమంలో తాజాగా రిలీజ్‌ అయిన బ్రో సినిమాలోనూ ఫ్యాన్‌ మూమెంట్‌ పేరిట నింపిన అడ్డగోలు సరుకు విషయంలోనూ.. డోసు ఎక్కువైందనే అభిప్రాయమూ వ్యక్తం అవుతోంది. అదే సమయంలో.. బ్రోలో ఓ పేరడీ సీన్‌ ద్వారా పొలిటికల్‌గానూ ఇప్పుడు కౌంటర్‌ ఎదుర్కొంటున్నాడు పవన్‌.  

ఈ ఏడాది తన నియోజకవర్గంలో జరిగిన సంక్రాంతి సంబురాల్లో ఏపీ మంత్రి అంబటి రాంబాబు హుషారుగా చిందులేసి అదరగొట్టారు. అయితే ఆ సీక్వెన్స్‌ను బ్రో సినిమాలో పేరడీ పేరిట చూపించారు. లైంగిక వేధింపులతో టీటీడీ పదవి.. పరువూ రెండూ పొగొట్టుకుని మెగా కాంపౌండ్‌ పంచన చేరాడు నటుడు థర్టీ ఇయర్స్‌ పృథ్వీ.

అతనిపై బ్రో సినిమాలో ఆ సందర్భాన్ని ‘శ్యాంబాబు’ క్యారెక్టర్‌ పెట్టి చిత్రీరించారు. అయితే దీనిపై ఏపీ జలవనరుల శాఖ మంత్రి ట్విటర్‌ వేదికగా చురకలు అంటించారు. గెలిచినోడి డాన్స్ సంక్రాంతి ! ఓడినోడి డాన్స్ కాళరాత్రి ! అంటూ జనసేనాని గూబ గుయ్యిమనేట్లు సమాధానం ఇచ్చారాయన.  పైగా నేరుగా పవన్‌ కల్యాణ్‌నే ట్యాగ్‌ చేశారాయన.

నాది ఆనందతాండవం.. పవన్‌ది శునకానందం
బ్రో సినిమాలో తనపై పేరడీ సీన్‌ పేరుతో హేళన చేసిన పవన్‌పై నేరుగానూ మంత్రి అంబటి రాంబాబు రియాక్ట్‌ అయ్యారు. విజయవాడలో పోలవరంపై ప్రజంటేషన్‌ తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన.. పవన్‌పై విమర్శలు గుప్పించారు. ‘‘పవన్‌ సినిమాలో నా క్యారెక్టర్‌ను పెట్టి అవమానించారని విన్నా.  పవన్‌ది శునకానందం. నన్ను రాజకీయంగా ఎదుర్కొనలేకే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నాడు. సంక్రాంతికి నేను వేసింది ఆనందతాండవం. ఎమ్మెల్యేగా నెగ్గి.. మంత్రి అయిన ఆనందం. నేను ఎవరి దగ్గరో డబ్బులు తీసుకునో, ప్యాకేజీ తీసుకునో డ్యాన్సులు చేయను. నా డ్యాన్స్‌ సింక్‌ అవ్వడానికి నేనేమైనా డ్యాన్స్‌ మాస్టర్‌నా?. అసలు రాజకీయాలకు పవన్‌ సింక్‌ అవ్వడు అంటూ సెటైర్లు గుప్పించారాయన.   

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)