Breaking News

జూనియర్ ఎన్టీఆర్ పేరు విన్నా చంద్రబాబుకు నిద్ర పట్టదు: కొడాలి నాని

Published on Fri, 05/27/2022 - 18:41

సాక్షి, తాడేపల్లి: మహానాడులో చంద్రబాబు నాయుడు‌ మేకపోతు గాంభీర్యం చూపుతున్నాడని మాజీ మంత్రి కొడాలి నాని ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి, టీడీపీకి పట్టిన శనిగ్రహం చంద్రబాబేనని మండిపడ్డారు. అధికారమే పరమావధిగా చంద్రబాబు అనుకుంటున్నారని, ఎన్టీఆర్ పేరు చెబితే ఇప్పటికీ చంద్రబాబుకు తడిచిపోతుందని ఎద్దేవా చేశారు. జూనియర్ ఎన్టీఆర్, సీనియర్ ఎన్టీఆర్ ఏ పేరు విన్నా చంద్రబాబుకు నిద్ర పట్టదని విమర్శించారు. 2018లోనే జనం 23 సీట్లకు పరిమితం చేసి వెళ్లగొట్టారని, ఐనా సరే ఇంకా రాజకీయాలలో తిరుగుతున్నాడని విమర్శించారు. 

‘ప్రతిపక్ష నేతగా కూడా పనికి రాని వ్యక్తి చంద్రబాబు. అమలాపురంలో తన మనుషులతోపాటు తనతో తిరిగే నిక్కర్ల బ్యాచ్‌తో ఇళ్లు తగులపెట్టించారు. మహానాడులో అడ్రస్ లేని వాళ్లని కూర్చోపెట్టుకున్నారు. సీఎం జగన్ గట్టిగా చూస్తేనే పరారయ్యే వారిని పక్కన కూర్చోపెట్టుకున్నారు. ముఖ్యమంత్రిని విమర్శించే అర్హత ఎవరికీ లేదు. సీఎం జగన్‌ తాను చెప్పిన అన్ని పథకాలను అమలు చేస్తున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అధిక శాతం పదవులు ఇచ్చారు. వారందరినీ రాజకీయంగా, సామాజికంగా పైకి తెస్తున్నారు.

రాష్ట్రంలో 50% బడుగులకు న్యాయం చేస్తుంటే జగన్‌ను ఎందుకు ఓడించాలి? బడుగులను వదిలేసి రామోజీరావు, రాధాకృష్ణ, బీఆర్ నాయుడులకు ప్రాధాన్యత ఇవ్వాలా? బస్సు యాత్ర మీద కూడా చంద్రబాబు విషం కక్కుతున్నారు. ఈ 420 మాట్లాడే మాటలను ఎవరూ విశ్వసించరు. కోట్లు ఖర్చు చేస్తూ చేసుకునే మహానాడుకి, బస్సుయాత్రకు సంబంధం ఏంటి? నీ కొడుకుని కూడా గెలిపించుకోలేని దద్దమ్మవి. ఎన్టీఆర్ వందో పుట్టినరోజు సందర్భంగా చంద్రబాబును రాష్ట్రం దాటి వెళ్లేలా తరిమి కొట్టాలి.
చదవండి: ‘టీడీపీది మహానాడు కాదు.. మాయనాడు’

Videos

Watch Live: వైఎస్ జగన్ కీలక ప్రెస్ మీట్

వాషింగ్టన్ డీసీలో కాల్పుల కలకలం

దీన్నే నమ్ముకొని ఉన్నాం.. మా పొట్టలు కొట్టొద్దు.. ఎండీయూ ఆపరేటర్ల ధర్నా

నా పర్మీషన్ తీసుకోవాల్సిందే!

ఢిల్లీ-శ్రీనగర్ విమానానికి తప్పిన ప్రమాదం

ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు బండారం బయటపడుతుందనే ఉరవకొండకి రాలేదు

జనసేనపై పిఠాపురం టీడీపీ నేతలు సంచలన వ్యాఖ్యలు..

ఏందిరయ్యా ఏంజేతున్నావ్

హైదరాబాద్ లో పలుచోట్ల వర్షం

పాక్ లో నన్ను పెళ్లి చేసుకో.. టెర్రరిస్టులతో జ్యోతి లవ్ స్టోరీ

Photos

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)

+5

'హరి హర వీరమల్లు' సాంగ్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

కాన్స్‌లో అదితి : ఆరుగజాల చీర, సింధూరంతో ముగ్ధమనోహరంగా (ఫొటోలు)

+5

కుమారుడి టాలెంట్‌ చూసి మురిసిపోతున్నడైరెక్టర్‌ సుకుమార్ భార్య (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో అనామిక ఖన్నా బ్యాక్‌లెస్ గౌనులో జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ ప్రముఖులు (ఫొటోలు)