Breaking News

ఏపీ హైకోర్టులో పిన్నెల్లికి ఊరట

Published on Thu, 05/23/2024 - 16:36

సాక్షి, విజయవాడ:   మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఉరట లభించింది. ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ను హైకోర్టు మంజూరు చేసింది. జూన్‌ 5 వరకు ఎలాంటి చర్యలు తీసుకోద్దని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ జూన్‌ 6కి వాయిదా వేసింది.

పిన్నెల్లితో సహా ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల ముందస్తు బెయిల్‌ పిటిషన్లపై హైకోర్టులో ఊరట లభించింది. అధికార, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన కేసులున్న అభ్యర్థులపై వచ్చే నెల 5వ తేదీ ఉదయం 10 గంటల వరకు అరెస్టు చేయొద్దంటూ హైకోర్టు ఆదేశించింది.

కాగా, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. పిన్నెల్లి తరపున న్యాయవాది నిరంజన్‌రెడ్డి తన వాదనలు వినిపిస్తూ.. సంఘటన ఈనెల 13న జరిగితే.. 15న ఎఫ్‌ఐఆర్‌ రిజిస్టర్ చేశారని పేర్కొన్నారు. ముందు ఎఫ్‌ఐఆర్‌లో గుర్తు తెలియని వ్యక్తులు అని పేర్కొన్నారని.. తర్వాత లోకేష్ ట్విట్టర్‌లో వీడియోను చూసి ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవడంపై నిరంజన్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.

ట్విట్టర్‌లో వీడియో మార్ఫింగ్ చేసి ఉండొచ్చని.. ఏడేళ్లలోపు శిక్ష పడే సెక్షన్లు కావడంతో పిన్నెల్లికి ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరిన నిరంజన్‌రెడ్డి.. సుప్రీంకోర్టు అర్నేష్ కుమార్ కేసులో మార్గదర్శక సూత్రాల ప్రకారం ఏడేళ్లలోపు శిక్షపడే సెక్షన్లు ఉంటే 41A నోటీసులు ఇవ్వాలని ఉందని పేర్కొన్నారు.

 

 

 

 

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)