Breaking News

అంత అర్జెంటుగా కిషోర్‌ను ఎందుకు అరెస్ట్ చేశారు?: ఏపీ హైకోర్టు

Published on Wed, 07/30/2025 - 15:37

సాక్షి, అమరావతి: రెంటచింతల పోలీసులు తనను అక్రమంగా నిర్బంధించారంటూ మాచర్ల మాజీ మున్సిపల్ చైర్మన్ తురకా కిషోర్‌ వేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. తురకా కిషోర్ తరఫున న్యాయవాది రామలక్ష్మణ్ రెడ్డి వాదనను వినిపించారు. తురక కిషోర్‌పై ఇప్పటికీ 12 అక్రమ కేసులు బనాయించారని ఆయన కోర్టుకు తెలిపారు.

‘‘ఒక కేసులో బెయిల్ రాగానే వెంటనే మరొక కేసు బనాయించి ఇబ్బంది పెడుతున్నారు. ఇవాళ గుంటూరు జిల్లా జైలు నుంచి తురకా కిషోర్ విడుదల కాగానే రెంటచింతల పోలీసులు జైలు బయటినుంచి తీసుకువెళ్లారు’’ అని కిషోర్‌ తరపు న్యాయవాది వివరించారు.

సంఘటన ఎప్పుడు జరిగిందంటూ ధర్మాసనం.. పోలీసులు తరఫున న్యాయవాదిని ప్రశ్నించింది.  2024 ఏప్రిల్ 8వ తేదీన సంఘటన జరిగిందని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఘటన జరిగిన 13 నెలల తర్వాత కేసు ఎలా రిజిస్టర్ చేశారు? అంత అర్జెంటుగా తురకా కిషోర్‌ను ఎందుకు అరెస్ట్ చేశారంటూ ధర్మాసనం ప్రశ్నించింది.

తురకా కిషోర్‌పై నమోదైన 12 కేసులు పూర్తి వివరాలు తమ ముందు ఉంచాలని ఎస్పీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తురక కిషోర్‌పై ఫిర్యాదులు ఎప్పుడు ఇచ్చారు..? సంఘటన ఎప్పుడు జరిగింది...? ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు? ఎప్పుడు అరెస్ట్ చేశారు.? ఎప్పుడు బెయిల్ వచ్చింది అనే పూర్తి అంశాలతో ఒక టేబుల్ రూపంలో కోర్టు ముందు ఉంచాలని పల్నాడు ఎస్పీని ఆదేశించిన ధర్మాసనం.. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది.

మాకు ఏమీ తెలియదని అనుకోవద్దు: హైకోర్ట్

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)