Breaking News

పిన్నెల్లి బెయిల్‌పై నేడే తీర్పు

Published on Tue, 05/28/2024 - 10:16

సాక్షి, విజయవాడ: మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ పిటీషన్‌పై నేడు(మంగళవారం) ఏపీ హైకోర్టు తీర్పు వెల్లడించనుంది. నిన్నటి వాదనలలో పోలీసుల కుట్రలు బట్టబయలు అయ్యాయి. పిన్నెల్లి విషయంలో పోలీసుల తీరు రోజురోజుకి దిగజారుతోంది. పిన్నెల్లి కౌంటింట్‌లో పాల్గోకుండా పోలీసులతో కలిసి పచ్చముఠా కుట్ర పన్నుతోంది. 

ఈవీఎం డ్యామేజ్ కేసులో జూన్ 6 వరకు పిన్నెల్లిపై చర్యలు తీసుకోవద్దని 23న హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు తీర్పు తర్వాతే అదే రోజు పిన్నెల్లిపై పోలీసులు మరో మూడు కేసులు నమోదు చేశారు. ఇందులో రెండు హత్యాయత్నం కేసులు నమోదు చేయడంతో ముందస్తు బెయిల్‌కి హైకోర్టుని మరోసారి  పిన్నెల్లి ఆశ్రయించారు. హైకోర్టు విచారణలో మూడు కేసులని మే 22న‌ నమోదు చేసినట్లుగా పోలీసులు వెల్లడించారు. 

చదవండి:  చంద్రబాబు సేవలో బదిలీ బలగాలు!

హైకోర్టు తీర్పు తర్వాతే 23న తప్పుడు కేసులు నమోదు చేశారని పిన్నెల్లి న్యాయవాది తెలిపారు.  రికార్డులు పరిశీలించడంతో రికార్డులు తారుమారు చేసినట్లు బయడపడింది. మే 23న కేసులు నమోదు చేసి 24న స్ధానిక మేజిస్డ్రేట్‌కు తెలియపరిచినట్లుగా రికార్డులలో నమోదు చేశారు. హైకోర్టుని తప్పుదోవ పట్టించే విధంగా పోలీసుల వ్యవహరించిన తీరుపై సర్వత్రా విస్మయం వ్యక్తం అవుతోంది. 

మరోవైపు ప్రభుత్వ జీఓ లేకుండా పోలీసుల తరపున ప్రైవేట్ న్యాయవాది అశ్వినీకుమార్ వాదించారు. తొలిరోజు వాదనలు వినిపించి రెండవ రోజు వాదనలకి అశ్వినీకుమార్ గైర్హాజరయ్యారు. ఆసక్తికరంగా బాదితుల తరపున టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు పోసాని వెంకటేశ్వర్లు ఇంప్లీడ్ పిటీషన్ వేసి వాదనలు వినిపించారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)