Breaking News

రఘురామ కొత్త రాగం

Published on Fri, 04/05/2024 - 08:45

పశ్చిమ గోదావరి, సాక్షి: కూటమి తరఫున నరసాపురం సీటు తనదేనని ప్రకటించుకున్న రఘురామ కృష్ణంరాజుకి ఊహించని షాక్‌ తగిలింది. పొత్తులో భాగంగా బీజేపీ సీటును ఎగరేసుకుపోవడంతో రఘురామ గొంతులో వెలక్కాయ పడ్డట్లయ్యింది. అయినప్పటికీ తన ప్రయత్నాలను మాత్రం మాననలేదు. తాను నమ్ముకున్న చంద్రబాబునే స్వయంగా రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది.  

ఈ క్రమంలో.. ఈసారి ఎన్నికల్లో రఘురామ పోటీ చేసి తీరతారని, ఈ మేరకు కూటమిలో సంప్రదింపులు జరుగుతున్నాయని ఈనాడు, ఆంధ్రజ్యోతిలు సైతం కథనాలు ఇస్తూ వస్తున్నాయి. బీజేపీ నుంచి నరసాపురం సీటు తీసుకునేందుకు రఘురామ విపరీతంగా పైరవీలు నడిపిస్తున్నట్లు సమాచారం. అదీ కుదరని పక్షంలో ఏదైనా అసెంబ్లీ సెగ్మెంట్‌ నుంచి పోటీ చేస్తారనేది ఆ కథనాల సారాంశం. ఈలోపు తాజాగా రఘురామ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.   

టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థిగా పోటీ చేయడమే తన ఆశయమంటూ ప్రకటించుకున్నారు రఘురామ. ‘‘నేను ఎక్కడి నుంచి పోటీ చేస్తాననేది మరో రెండు రోజుల్లో తేలుతుంది. ఢిల్లీ ఎంపీగానో, అమరావతి ఎమ్మెల్యేగానో చూడాలి. పోటీ చేయడమైతే పక్కా. ఎంపీగా బరిలో నిలవాలన్నది నా ఆశ. అసెంబ్లీలో ఉండాలన్నది ప్రజల కోరిక.చాలా మంది నన్ను అసెంబ్లీలో స్పీకర్‌గా చూడాలనుకుంటున్నారు. నేను కోరుకుంటున్న కేంద్రమా, ప్రజలు కోరుతున్న రాష్ట్రమో త్వరలోనే తెలుస్తుంది’’ స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. 

మరోవైపు ఇవాళ నరసాపురంలో పర్యటించనున్న చంద్రబాబు.. రఘురామ పోటీ కోసం జరిగే కూటమి చర్చల్లో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. తాను చెబితేనే వైఎస్సార్సీపీని, సీఎం వైఎస్‌ జగన్‌ను టార్గెట్‌​ చేసిన రఘురామ కోసం ఎలాగైనా సీటు ఇప్పించాలని చంద్రబాబు తీవ్ర ప్రయత్నాల్లో ఉన్నట్లు స్పష్టమవుతోంది.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)