Breaking News

ముగిసిన ఓజీ ప్రమోషన్స్‌! మళ్లీ పొలిటికల్‌ మోడ్‌లోకి..

Published on Fri, 10/03/2025 - 13:49

హైదరాబాద్‌/అమరావతి, సాక్షి: జ్వరంతో రాజకీయాలకు, తన విధులకు స్వల్ప విరామం తీసుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. తిరిగి బిజీ అయ్యారు. ఏపీ కేబినెట్‌ సమావేశం నేపథ్యంలో స్పెషల్‌ ఫ్లైట్‌లో హైదరాబాద్‌ నుంచి ఆయన విజయవాడకు చేరుకున్నారు.

వైరల్‌ ఫీవర్‌ కారణంగా మెరుగైన వైద్యం కోసం ఆయన హైదరాబాద్‌ వచ్చారని ఆయన సిబ్బంది అధికారికంగానే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే.. ఇక్కడికి వచ్చాక ఆయన జ్వరం ఎగిరిపోయినట్లు తెలుస్తోంది. అందుకే ఎలాగూ వచ్చా కదా అని..  హైదరాబాద్‌లో అన్నయ్య చిరు అండ్‌ మెగా ఫ్యామిలీతో కలిసి ఓజీ స్పెషల్‌ ప్రివ్యూ వేసుకుని చూశారు. అంతేకాదు.. ఓజీ సక్సెస్ మీట్‌లలో హుషారుగా పాల్గొని సందడి చేశారు. అఫ్‌కోర్స్‌.. ఈ మధ్యలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా వచ్చి పవన్‌ను పరామర్శించారు అది వేరే విషయంలేండి. మరోవైపు.. 

అసెంబ్లీ సమావేశాల్లో బీజేపీ ఎమ్మెల్యే కామినేని.. ‘వైఎస్‌ జగన్‌ సీఎంగా ఉన్న టైంలో సినిమా వాళ్లను పిలిపించుకుని మరీ అవమానించారంటూ’’ చేసిన వ్యాఖ్యలు.. వాటిపై స్పందించే క్రమంలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మెగాస్టార్‌ చిరంజీవిని ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. 

జగన్‌ తనను సాదరంగా ఆహ్వానించారంటూ చిరు ఒక బహిరంగ ప్రకటనతో తేల్చేయడంతో బాలయ్యపై అటు మెగా అభిమానులు, ఇటు వైఎస్సార్‌సీపీ నేతలు భగ్గుమన్నారు. ఆ వ్యాఖ్యలపై పవన్‌ ఎలాంటి స్పందన ఇవ్వలేదు. పవన్‌ సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోవడాన్ని ఇటు చిరు ఫ్యాన్స్‌తో పాటు అటు జనసేన కార్యకర్తలే ఒకానొక దశలో భరించలేకపోయారు. మరి జ్వరం తగ్గింది కదా.. పొలిటికల్‌ అవతార్‌లోకి మారిపోయారు కదా.. ఇకనైనా స్పందిస్తారేమో చూడాలి అంటున్నారు పలువురు నెటిజన్లు.

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)