చంద్రబాబు అత్యుత్సాహం.. పురంధేశ్వరిని ఢిల్లీకి పిలిచిన హైకమాండ్‌!

Published on Tue, 03/19/2024 - 12:07

సాక్షి, విజయవాడ: కూటమి ఏర్పాటు నేపథ్యంలో ఏపీ బీజేపీలో రాజకీయం హీటెక్కింది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో సీట్ల కేటాయింపు విషయంలో బీజేపీ నేతలు పంచాయితీ పెట్టారు. ఇక, తాజాగా సీట్ల పంచాయితీ మరోసారి ఢిల్లీకి చేరింది. ఏపీ బీజేపీ సీనియర్‌ నేతలు ఢిల్లీ పెద్దలను కలవడం హాట్‌ టాపిక్‌గా మారింది. 

కాగా, ఏపీ బీజేపీలో మొదటి నుంచి ఉన్న వారికి కాకుండా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వారికే ప్రాధాన్యత ఇస్తున్నారని నేతలు ఫిర్యాదు చేశారు. బీజేపీ నేతలు కోరిన సీట్లను కాకుండా రెండున్నర దశాబ్దాలుగా టీడీపీ ఓడిపోయిన సీట్లను చంద్రబాబు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని పార్టీ పెద్దలకు చెప్పారు. బీజేపీ సీట్లపై చంద్రబాబు పెత్తనం ఏంటి? పార్టీ సీనియర్‌ నేతలు హైకమాండ్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్బంగా శివప్రకాష్‌ జీని కలిసి ఫిర్యాదు చేశారు. 

ఇదిలా ఉండగా.. ఏపీ బీజేపీ సీనియర్‌ నేతలు కొందరు ఇప్పటికే పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు లేఖ రాసిన విషయం తెలిసిందే. బీజేపీ నేతల ఫిర్యాదు కారణంగానే పురంధేశ్వరి ఢిల్లీకి వెళ్లినట్టు సమాచారం. ఇదే సమయంలో, నేడు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో బీజేపీ పెద్దలు పురంధేశ్వరితో ఏపీలో రాజకీయ పరిణామాలు, టికెట్లు, అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 

Videos

ఫ్లెక్సీని చూసి తన తల్లి అనుకొని.. పాల కోసం ఆకలితో లేగదూడ తంటాలు

నువ్వు జోక్యం చేసుకుంటే.. నీ హోంమినిస్టర్ పోస్ట్ ఊడిపోతుంది..!

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేయించిన కూటమి సర్కార్

దగ్గుపాటి ప్రసాద్ కు గంగారాం షాక్!

బస్సును ముద్దాడిండు డ్రైవరన్న

ప్రియుడితో కలిసి భర్తను చంపేందుకు భార్య కుట్ర

అవి వాళ్ళు రాస్తే వచ్చే మార్కులు కాదు.. SGT ప్రభాకర్ కు ఉద్యోగం ఎలా ఇచ్చారంటే

ఇంకెన్నాళ్లు నీ కొడుకును కాపాడుకుంటావ్.. వైఎస్ జగన్ సెన్సేషనల్ కామెంట్స్

ఒక రోజుకు 80 లక్షలు... ఎవడబ్బ సొమ్మని ఖర్చు పెడుతున్నారు..!

చైనా వేదికపై ఫేక్ మేయర్ ప్రచారం?

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)