Breaking News

‘‘వలంటీర్‌ వ్యవస్థే లేదు’’.. భగ్గుమన్న శాసనమండలి

Published on Wed, 11/20/2024 - 10:39

సాక్షి, అమరావతి: వలంటీర్‌ వ్యవస్థపై ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలిలో మంటలు చేగాయి. ఈ వ్యవస్థకు సంబంధించి ప్రశ్నోత్తరాల టైంలో వైఎస్సార్‌సీపీ ఈ అంశాన్ని లేవనెత్తగా.. ప్రభుత్వం నుంచి దిగ్భ్రాంతికి గురి చేసే సమాధానం వచ్చింది.  

‘‘రాష్ట్రంలో వలంటీర్లు పని చేయడం లేదు. అసలు వలంటీర్ వ్యవస్థే లేదు. లేనివ్యవస్థ ను అసలు ఎలా కొనసాగిస్తాం. ఒకవేళ కొనసాగిస్తేనే జీతాలు పెంచుతాం అన్నాం. అసలు కొనసాగించలేదు.. కాబట్టి జీతాలు పెంచం’’ అని ఏపీ సాంఘిక సంక్షేమ మంత్రి బాల వీరాంజనేయులు బదులిచ్చారు. దీంతో మండలిలో మంటలు చెలరేగాయి. 

మంత్రి సమాధానంపై వైఎస్సార్‌సీపీ భగ్గుమంది. ‘‘ఎన్నికల్లో మీరు వలంటీర్లకు 10 వేలు గౌరవ వేతనం ఇస్తామన్నారు. కానీ, ఇప్పుడు మంత్రి అసలు వ్యవస్థ లేదనడం దారుణం. రెన్యూవల్ జీవో మీరు ఇవ్వొచ్చు కదా!’’ అని మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ నిలదీశారు.

‘‘వాలంటీర్ల గౌరవ వేతనం పెంచుతామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. 5 వేలు వేతనాన్ని 10 వేలు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఎన్నికలు అయ్యాక వాలంటీర్ల ను మోసం చేశారు’’ అని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి అన్నారు.

వలంటీర్‌ వ్యవస్థ విషయంలో వైఎస్సార్‌సీపీ అనుమానాలే నిజమయ్యాయి. చంద్రబాబు ప్రభుత్వం వలంటీర్లను దారుణంగా మోసం చేస్తారని, ఆ వ్యవస్థను రద్దు చేసే కుట్ర జరుగుతోందని చెబుతూ వస్తోంది. ఇప్పుడు మంత్రి సమాధానంతో ఆ కుట్రే నిజమని తేలింది.

Videos

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు