Breaking News

ఏపీలో ఫిరాయింపు ఎమ్మెల్సీలపై వేటు

Published on Tue, 03/12/2024 - 08:35

సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ ఫిరాయించిన ఇద్దరు ఎమ్మెల్సీలపై వేటు పడింది. ఎమ్మెల్సీలు వంశీ కృష్ణయాదవ్‌, సి. రామచంద్రయ్యలపై వేటు వేస్తున్నట్లు ప్రకటించారు శాసన మండలి చైర్మన్‌ మోషేన్‌ రాజు. ఈ ఇద్దరు వైఎస్సార్‌సీపీ తరఫున ఎమ్మెల్సీలుగా ఎన్నికైన సంగతి తెలిసిందే.

అయితే వంశీకృష్ణ జనసేనలోకి, సి.రామచంద్రయ్య టీడీపీలోకి పార్టీ మారారు. దీంతో పార్టీ ఫిరాయింపుల కింద చర్యలు తీసుకోవాలంటూ మండలి కార్యదర్శికి వైఎస్సార్‌సీపీ నేత, మండలిలో చీఫ్‌ విప్‌ మేరిగ మురళీధర్‌, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిలు ఫిర్యాదు చేశారు. 

ఈ నేపథ్యంలో ఫిరాయింపు నిరోధక చట్టం కింద ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలంటూ.. మండలి చైర్మన్‌ మోషేన్‌ రాజు ఆ ఇద్దరికి నోటీసులు పంపించారు. నోటీసుల ఆధారంగా వాళ్లిద్దరి నుంచి వివరణ సైతం తీసుకున్నారు మండలి చైర్మన్‌. ఈ క్రమంలో.. ఇప్పుడు సమగ్ర విచారణ అనంతరమే ఈ ఇద్దరిపై వేటు వేసినట్లు మండలి చైర్మన్ మోషేన్ రాజు ప్రకటించారు.

Videos

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)