Breaking News

ఏపీ అసెంబ్లీ: బెల్టు షాపులపై వాడీవేడి చర్చ.. బొత్స కౌంటర్‌

Published on Fri, 03/07/2025 - 11:14

AP Assembly Sessions Updates..

👉ఏపీ అసెంబ్లీలో బడ్జెట్‌ సమావేశాలు కొనసాగుతున్నాయి. శాసనమండలిలో పలు అంశాలపై అధికార పార్టీని ప్రశ్నిస్తున్నారు ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్‌సీపీ నేతలు. ఈరోజు సమావేశాల్లో భాగంగా మద్యం బెల్టు షాపులపై చర్చ జరిగింది. వైఎస్సార్‌సీపీ నేతల ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ఏపీలో మద్యం అమ్మకాలు పెరిగాయని మంత్రి కొల్లు రవీంద్ర అంగీకరించారు.

శాసన మండలి..

  • మండలిలో మద్యం బెల్టు షాపులపై వాడి వేడి చర్చ

  • మద్యం బెల్టు షాపులపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు బొత్స సత్యనారాయణ, వరుదు కల్యాణి, తోట త్రిమూర్తులు ఆగ్రహం

 

👉ఎమ్మెల్సీ బొత్స కామెంట్స్‌..

  • గత ప్రభుత్వంలో ఎక్కువ కేసులు పెట్టబట్టే మద్యం అమ్మకాలు తగ్గాయి

  • మరి ఈ పది నెలల కాలంలో ఎందుకు కేసులు పెట్టలేదు

  • గతంలో ఉన్న బ్రాండ్లే ఇప్పుడూ అమ్ముతున్నారు

  • ఆ బ్రాండ్లను ఎందుకు బ్యాన్ చేయలేదు?

  • సభలో మాట్లాడటానికి మాకు హక్కు లేదని మంత్రి అచ్చెన్న మాట్లాడటం సరికాదు

  • ఎన్టీఆర్ మద్యపాన నిషేధం తెచ్చారు

  • మద్యపాన నిషేధానికి తూట్లు పొడిచింది ఎవరు?.

  • సతివాడలోని ఒక బెల్ట్ షాపును 50 లక్షలకు వేలం పాడారు

  • రాత్రి 9 నుంచి ఉదయం 10 వరకూ అమ్ముకోవడానికి వేలం పెట్టారు


👉ఎమ్మెల్సీ వరుదు కల్యాణి కామెంట్స్‌..

  • మద్యం బెల్టు షాపులు వల్ల మహిళలపై నేరాలు పెరుగుతున్నాయి

  • మద్యం అమ్మకాలు బెల్టు షాపులు వల్ల విపరీతంగా పెరిగాయి

  • చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక మద్యం అమ్మకాలు 18 శాతం, బీర్ల అమ్మకాలు 40 శాతం పెరిగాయి

  • స్కూల్స్‌, కాలేజీల దగ్గర లోనే బెల్టు షాపులు పెట్టారు

  • బెల్టు షాపులు పెడితే 5 లక్షలు జరిమానా అన్నారు.

  • మరి ఎంత మందికి వేశారు?

  • బెల్టు షాపులు పెడితే మద్యం షాపులు రద్దు చేస్తామన్నారు..

  • ఎన్ని లైసెన్స్ లు రద్దు చేశారు?.


👉ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ​కామెంట్స్‌

  • సీఎం చంద్రబాబు బెల్టు షాపులు పెడితే బెల్టు తీస్తాం అన్నారు

  • ఎంతమందికి బెల్టు తీశారు చెప్పండి

  • మద్యం బెల్టు షాపులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?

  • ఐదు లక్షల ఫైన్ వేస్తామన్నారు

  • ఎన్ని బెల్టు షాపులకు ఐదు లక్షలు ఫైన్ వేశారు

  • ఎన్ని బెల్ట్ షాపులు మూయించారు

 

👉పీడీఎఫ్ ఎమ్మెల్సీ, ఇళ్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ..

  • మద్యం ద్వారా ఆదాయం పెంచుకోవాలనే ఆలోచనలలో ప్రభుత్వం ఉంది

  • మద్యాన్ని నియంత్రించాలని ఆలోచన చేయడం లేదు

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)