నరసరావుపేటలో స్థానికేతరులకే పట్టం

Published on Fri, 04/26/2024 - 10:51

సాక్షి, నరసరావుపేట: ఎన్నికల్లో అభ్యర్థి స్థానికత అంశం ఎంతో కీలకం. కొన్నిసార్లు దాని ఆధారంగా గెలుపోటములు ప్రభావితమవుతుంటాయి. నరసరావుపేట ఓటర్లు 1998 పార్లమెంట్‌ ఎన్నికల నుంచి ఇప్పటివరకు పల్నాడు వెలుపలి వారినే పట్టం కడుతున్నారు. ప్రధాన పారీ్టలు కూడా నాన్‌లోకల్‌ అభ్యర్థులనే బరిలోకి దింపుతున్నాయి. 1998 ఎన్నికలలో ప్రస్తుత బాపట్ల జిల్లాలోని వేమూరులో జన్మించిన మాజీ సీఎం కొణిజేటి రోశయ్యను నరసరావుపేట పార్లమెంట్‌ ఓటర్లు గెలిపించారు. ఆ తరువాత 1999 ఎన్నికల్లో మరో మాజీ సీఎం నేదురుమల్లి జనార్థన్‌రెడ్డి టీడీపీ అభ్యర్థి లాల్‌జాన్‌బాషాపై గెలుపొందారు. ఇదే లోకసభ నియోజకవర్గం నుంచి కాసు బ్రహ్మానందరెడ్డి ఎంపీగా గెలవడంతో ముగ్గురు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సీఎంలను ఢిల్లీకి పంపిన ఘనత నరసరావుపేటకి దక్కింది. 

నేదురుమల్లి తర్వాత 2004 సార్వత్రిక ఎన్నికల్లో నెల్లూరు జిల్లాకు చెందిన మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఎంపీగా గెలుపొందారు. వీరు ముగ్గురు కాంగ్రెస్‌–ఐ పార్టీ తరపున గెలుపొందారు. 2009లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరుపున పోటీ చేసిన మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి గెలుపొందారు. మోదుగుల స్వస్థలం గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం పెదపరిమి. ఆంధ్రప్రదేశ్‌ విభజన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో రాయపాటి సాంబశివరావు మాత్రం అమరావతి మండలం ఉంగుటూరు గ్రామానికి చెందినవారు.2019లో జరిగిన చివరి సార్వత్రిక ఎన్నికల్లో గుంటూరు జిల్లా పెదనందిపాడుకు చెందిన లావు శ్రీకృష్ణదేవరాయులు వైఎస్సార్‌ సీపీ తరపున పోటీ చేసి గెలిచారు. ఇలా గత ఆరు ఎన్నికల్లో ఐదుమంది పల్నాడు ప్రాంతానికి చెందని వారు ఎంపీగా గెలుస్తున్నారు.  

నెల్లూరు సెంటిమెంట్‌ 
రాజకీయంగా నరసరావుపేటకి నెల్లూరుకి అవినాభావసంబంధం ఉన్నట్టు ఉందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. 1999 ఎన్నికల్లో నెల్లూరు జిల్లా నుంచి వచ్చి కాంగ్రెస్‌ పార్టీ తరపున పోటీ చేసిన నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డిని పల్నాడు ప్రాంత వాసులు గెలిపించారు. తరువాత ఎన్నికల్లో అదే నెల్లూరు నుంచి వచ్చి కాంగ్రెస్‌ పార్టీ తరపున బరిలో నిలిచిన మేకపాటి రాజమోహన్‌రెడ్డిని నరసరావుపేట పార్లమెంట్‌ ఓటర్లు 86,255 ఓట్ల భారీ మెజారీ్టతో గెలిపించారు. ఇలా ఇప్పటివరకు నెల్లూరు నుంచి వచ్చి పోటీ చేసిన నేతలకు నరసరావుపేట ఓటర్లు బ్రహ్మరథం పట్టారు. త్వరలో జరగనున్న 2024 సార్వత్రిక ఎన్నికల్లోనూ నెల్లూరు జిల్లా వాసి మాజీ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ వైఎస్సార్‌సీపీ తరపున పోటీలో ఉంటున్నారు. దీంతో మరోసారి నెల్లూరు సెంటిమెంట్‌ పనిచేసి అనిల్‌కుమార్‌ యాదవ్‌ గెలుపు పక్కా అని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.  

అనిల్‌కుమార్‌ యాదవ్‌కు బ్రహ్మరథం 
బీసీల అడ్డా అయిన నరసరావుపేట పార్లమెంట్‌ పరిధిలో ఇంతవరకు ఒక్క బీసీ అభ్యర్థి కూడా ఎంపీగా గెలుపొందలేదు. బీసీలను రాజకీయంగా ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బీసీ వర్గానికి చెందిన పి.అనిల్‌కుమార్‌ యాదవ్‌ను పోటీలో ఉంచిన విషయం తెలిసిందే. ఇప్పటికే అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో ఆయన గెలుపు పక్కా అనే టాక్‌ వినిపిస్తోంది.  
 

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)