Breaking News

9 సార్లు రీకౌంటింగ్.. ఫ‌లితం తారుమారు!

Published on Tue, 11/03/2026 - 19:25

చిత్తూరు జిల్లా పలమనేరు మున్సిపాలిటీలో కూటమి నేతల దౌర్జన్యకాండ కొన‌సాగుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన వారిని త‌మ పార్టీలో చేరాల‌ని టీడీపీ నాయ‌కులు కుట్ర‌లు చేస్తున్నారు. పలమనేరులో 34వ వార్డు నుంచి గెలిచిన వైఎస్సార్‌సీపీ అభ్య‌ర్థి సల్మా భారతిపై ఒత్తిడి పెంచుతున్నారు. సల్మా భారతి 6 ఓట్లతో గెలిచినా.. ప‌చ్చ పార్టీ నేత‌లు అధికారుల‌పై ఒత్తిడి తీసుకొచ్చి ఇప్పటికి 9 సార్లు రీకౌంటింగ్ చేయించారు. టీడీపీ నాయ‌కుల ఆదేశాల‌తోనే సల్మా భారతి విజ‌యాన్ని అధికారులు అధికారికంగా ప్ర‌క‌టించ‌లేద‌న్న ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. త‌మ పార్టీలో చేరాలని సల్మా భారతిని టీడీపీ నేత‌లు ఒత్తిడి చేస్తున్నారు. ఒప్పుకోక‌పోవ‌డంతో ఆమె విజ‌యాన్ని అడ్డుకుంటున్నార‌ని వైఎస్సార్‌సీపీ ఆరోపిస్తోంది.

తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ కూటమి ప్రభుత్వం కుట్రలకు దిగింది. వైఎస్సార్‌సీపీ అభ్య‌ర్థి ఫ‌లితాన్ని తారుమారు చేసేంది. 27వ డివిజన్ నుంచి వైఎస్సార్‌సీపీ అభ్య‌ర్థి గీతా మోహన్ గెలుపొంద‌గా, రీకౌంటింగ్‌లో ఫ‌లితాన్ని మార్చేశారు. స్వతంత్ర అభ్యర్థి రేవతి గెలిచినట్టు ప్రకటించ‌డంతో వైఎస్సార్‌సీపీ నేత‌లు దిగ్భ్రాంతికి గుర‌య్యారు. అధికారుల వ్య‌వ‌హార‌శైలిపై నిర‌స‌న వ్య‌క్తం చేశారు.

మంత్రి మాయాజాలం
కర్నూలు మున్సిప‌ల్‌ కార్పొరేషన్ ఎన్నిక‌ల్లో స్వ‌యంగా మంత్రి టీజీ భరత్ రంగంలోకి దిగి వైఎస్సార్‌సీపీ అభ్య‌ర్థి విజ‌యాన్ని అడ్డుకున్నారు. కమిషనర్ చల్లా ఓబులేసుపై ఒత్తిడి తీసుకొచ్చి కౌంటింగ్ కేంద్రంలోని అధికారుల స‌హ‌కారంతో ఫ‌లితాన్ని తారుమారు చేశారు. 49వ వార్డులో 11 ఓట్లతో వైఎస్సార్‌సీపీ విజయం సాధించ‌గా.. డిక్లరేషన్ ఫాం ఇవ్వకుండా టీజీ భరత్ అడ్డుప‌డ్డారు. రీకౌంటింగ్ డ్రామాకు తెర‌లేపారు. రీకౌంటింగ్‌లో వైఎస్సార్‌సీపీకి వ‌చ్చిన 15 ఓట్లు చెల్లనివిగా పరిగణించి, 4 ఓట్లతో టీడీపీ విజయం సాధించిన‌ట్టు అధికారులతో ప్ర‌క‌టింప‌జేశారు. కూట‌మి ప్ర‌భుత్వ కుట్ర‌పై వైఎస్సార్‌సీపీ నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

ఇదీ చ‌ద‌వండి: ఎన్నిక‌ల ఫ‌లితాల్లోనూ టీడీపీ కుయుక్తులు

వైజాగ్‌లో విచిత్రం
విశాఖప‌ట్నం న‌గ‌ర పాల‌క సంస్థ ఎన్నిక‌ల కౌంటింగ్‌లో కూటమి నేతలు అక్రమాలకు పాల్ప‌డ్డారు. 91వ వార్డులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మద్దాల అప్పారావు గెలిచిన‌ట్టు మొదట అధికారులు ప్రకటించారు. కూటమి నేతలు ఒత్తిడితో త‌ర్వాత‌ లెక్కలను తారుమారు చేశారు. రీ కౌంటింగ్ చేయకుండానే చెల్ల‌ని ఓట్ల‌తో క‌లిపి టీడీపీ అభ్యర్థి 4 ఓట్లతో గెలిచినట్టు ప్రకటించేశారు. 

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)