Breaking News

మరో వివాదంలో టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌

Published on Sat, 01/17/2026 - 15:07

సాక్షి, అనంతపురం జిల్లా: అనంతపురం అర్బన్‌ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ మరో వివాదంలో చిక్కుకున్నారు. మహిళా డాక్టర్‌ భర్తను బండ బూతులు తిట్టారు. తాము కొనుగోలు చేసిన రూ.కోటి విలువైన భవనాన్ని డబుల్‌ రిజిస్ట్రేషన్‌ చేశారని ఆస్రాకంటి ఆసుపత్రి యాజమానులు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌, బంధువులే డబుల్‌ రిజిస్ట్రేషన్‌ చేయించారని ఆరోపించారు.

దీంతో మహిళా డాక్టర్‌ భర్త షరీఫ్‌కు ఫోన్‌ చేసిన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌.. తనపైనే విమర్శలా అంటూ అసభ్యంగా మాట్లాడారు. మైనారిటీ దంపతులను అసభ్యంగా దూషించారు. సోషల్‌ మీడియాలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ ఆడియో వైరల్‌గా మారింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఎమ్మెల్యే ఆడియోపై సర్వత్రా చర్చ జరుగుతోంది.

కాగా, ఇటీవల టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌కు ఎదురుదెబ్బ తగిలిన సంగతి తెలిసిందే. ఆయనకు కేటాయించిన గన్‌మెన్ షేక్షావలిపై సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అనంతపురం నగరంలో నిర్వహించిన ఎగ్జిబిషన్ నిర్వాహకులను గన్‌మెన్ షేక్షావలి, ఎమ్మెల్యే అనుచరులు కలిసి 20 లక్షల రూపాయలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. డబ్బు ఇవ్వకపోవడంతో నిర్వాహకులపై దాడి చేసినట్లు సమాచారం. ఎగ్జిబిషన్ నిర్వాహకులపై ఎమ్మెల్యే గన్‌మెన్‌తో పాటు కొంతమంది టీడీపీ నేతలు దాడి చేసినట్లు స్థానిక వర్గాలు తెలిపాయి.

ఎమ్మెల్యే దగ్గుపాటి బూతు పురాణం

 

 

 

Videos

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)