Breaking News

మున్సిపల్‌ చైర్మన్‌ పదవి కోసం టీడీపీ ప్రలోభాలు

Published on Wed, 12/10/2025 - 09:13

అనంతపురం  మరోసారి టీడీపీ  కుట్ర రాజకీయాలకు తెరలేపింది.  జిల్లాలోని కళ్యాణదుర్గం మున్సిపల్‌ చైర్మన్‌ పదవి కోసం వైఎస్సార్‌సీపీ నేతలను టీడీపీ ప్రలోభాలకు గురిచేస్తోంది. వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లకు టీడీపీ నేతలు ఫోన్లు చేసి డబ్బు ఆశ చూపుతున్నారు. ‘ మీకు ఎంతైనా ఇస్తాం.. మాకు  ఓటయ్యండి’ అంటూ ప్రలోభాలకు పాల్పడుతున్నారు పలువురు టీడీపీ నేతలు. 

డబ్బు ఎంతైనా ఇస్తామంటూ ఫోన్‌లో ఓ టీడీపీ నేత మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. ప్రలోభాలకు గురిచేస్తున్న కూటమికి చెందిన సోమశేఖర్‌ ఆడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. రేపు(డిసెంబర్‌ 11వ తేదీ) కళ్యాణదుర్గం మున్సిపల చైర్మన్‌  ఎన్నిక జరుగనున్నతరుణంలో వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లను టీడీపీ ప్రలోభ పెడుతోంది. 

గతంలో పలు సందర్భాల్లో టీడీపీ ఈ తరహా చర్యలకు పాల్పడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఈ తరహా చర్యలపై రాజకీయ విశ్లేషకుల నుంచి విమర్శలు ఎదుర్కొన్న కూటమి నేతలు.. తమ వైఖరిని మాత్రం మార్చుకోవడం లేదని విశ్లేషకులు విమర్శిస్తున్నారు. 

కాగా, మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నిక నేపథ్యంలో బుధవారం(డిసెంబర్‌ 10వ తేదీ)  నుంచి కళ్యాణదుర్గంలో 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని ఎన్నికల ప్రిసైడింగ్‌ అధికారి వసంతబాబు అన్నారు. గురువారం మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నిక జరగనుంది. మంగళవారం డీఎస్పీ రవిబాబు, మున్సిపల్‌ కమిషనర్‌ వంశీకృష్ణ భార్గవ్‌తో కలిసి ఆర్డీఓ ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో మొత్తం 24 వార్డు కౌన్సిలర్లతో పాటు ఎమ్మెల్యే, ఎంపీలకు ఎక్స్‌ అఫిషియో సభ్యులుగా ఓటు హక్కు ఉందన్నారు.  చైర్మన్‌ ఎన్నికకు ఓటు హక్కు కలిగిన వారు తమ గుర్తింపు కార్డుతో హాజరుకావాలన్నారు. మున్సిపల్‌ కార్యాలయానికి 200 మీటర్ల దూరంలోనే సెక్యూరిటీ జోన్‌గా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నిక నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు జరగ కుండా గట్టి బందోబస్తు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. చైర్మన్‌ ఎన్నికకు రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు.

చంద్రబాబు  సర్కారు తీరుపై కోట్ల మంది కన్నెర్ర

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)