ఇంత బిల్డప్‌ ఇచ్చారు.. తీరా చూస్తే.. ఇదేంటి ఆనం..

Published on Sat, 07/01/2023 - 19:53

జిల్లాలో ఎక్కడ పోటీ చేసినా తిరుగులేదు. అన్ని చోట్లా నా అనుచరులు ఉన్నారంటూ బిల్డప్ ఇచ్చిన ఆ నేతకు కష్టాలు స్టార్ట్ అయ్యాయి. అడుగుపెట్టిన ప్రతి చోటా.. స్థానిక నేతల నుంచి ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. కుటుంబ సభ్యుల నుంచి కూడా వ్యతిరేకత రావడం ఇప్పుడు ఆయన్ని ఆందోళనలోకి నెట్టేసింది.

నెల్లూరు జిల్లాలో రాజకీయ చరిత్ర కల్గిన ఆనం రామనారాయణ రెడ్డి పరిస్థితి ఇప్పుడు కుడితిలో పడ్డ ఎలుక చందంగా మారిందని జిల్లాలో ఆయన గురించి తెలిసిన రాజకీయ నాయకులు, స్థానిక ప్రజలు చెప్పుకుంటున్నారు. ఎమ్మెల్యేగా గెలిపించిన పార్టీ మీదే విమర్శలు చేసిన అనం.. తెలుగుదేశంతో టచ్ లోకి వెళ్లారు. అధికార పార్టీలో ఎమ్మెల్యేగా ఉండి.. తనకు కావాల్సినవి జరగలేదన్న అక్కసుతో ప్రతిపక్షం చెంత చేరిన ఆనం.. జిల్లాలో నారా లోకేష్ పాదయాత్ర ద్వారా తన బలం.. బలగాన్ని చూపాలని ప్రయత్నించి బోర్లా పడ్డారు. లోకేష్ పాదయాత్రలో అన్నీ తానై వ్యవహరించి, జిల్లా తెలుగుదేశం పార్టీ పగ్గాలు దక్కించుకోవాలన్న ఆలోచన బెడిసి కొట్టిందట. ఆత్మకూరులో ఇటీవల జరిగిన పరిణామాలు ఇందుకు తార్కాణంగా చెబుతున్నారు. 

లోకేష్ పాదయాత్రలో మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్య నాయుడు లోకేష్, అనం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనం రామనారాయణ రావడం వల్లే తనకు టీడీపీలో ప్రాధాన్యత లేకుండా పోయిందని గ్రహించిన కొమ్మి.. పార్టీ అధిష్టానంపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. మరోవైపు టీడీపీ కష్టకాలంలో ఉన్నపుడు వెన్నంటి ఉన్న గూటూరు కన్నబాబును చంద్రబాబు కరివేపాకులా తీసేసి వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కు ద్రోహం చేసి వచ్చిన ఆనంకి ఆత్మకూరు బాధ్యత అప్పగించారు. దీంతో కన్నబాబుకి మండి ఎవరికీ అందుబాటులో లేకుండా అమెరికా ప్రయాణం కట్టేశాడట.
చదవండి: ‘ఈనాడు’ అసలు బాధ అదేనా?.. ఎందుకీ పడరాని పాట్లు..!

ఆత్మకూరు టీడీపీలో ఎదురైన ఈ పరిణామం ఒకెత్తయితే స్థానిక వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ప్రకటించిన ఆత్మకూరు అభివృద్ధి అజెండాకు నియోజక వర్గ ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. విక్రం వివరిస్తున్న తీరుకు..చేస్తున్న అభివృద్ధికి ప్రజలు ఫిదా అయ్యారు. ఎమ్మెల్యే కార్యక్రమాలకు భారీగా జనాలు రావడం.. క్యాడర్ లో జోష్ గమనించిన ఆనం రామనారాయణ ఆత్మకూరు నుంచి తన దృష్టిని నెల్లూరు సిటీ వైపు మళ్ళించారట.

ఆనం వేసిన ఈ ఎత్తును గమనించిన మాజీ మంత్రి నారాయణ అనుచరులు టీడీపీ సిటీ ఇంఛార్జి అగ్గిమీద గుగ్గిలమవుతున్నారట. మా సీటు కోసం ఎవరు ప్రయత్నించినా ఒప్పుకోం అంటున్నారట. మరో వైపు ఉమ్మడి కుటుంబ సభ్యుల నుంచి ఆనంకి ఎదురు గాలి వీస్తోందన్న ప్రచారం వినిపిస్తోంది. ఆనం వివేకానందరెడ్డి భుజాలపై రాజకీయంగా ఎదిగి.. ఆయన మరణానతరం అందరినీ వదిలి తాను.. తన కుమార్తె అన్నట్టుగా రామ నారాయణ రెడ్డి వ్యవహరిస్తూ ఉన్నారని ఉమ్మడి కుటుంబ సభ్యులు ఆగ్రహిస్తున్నారట.
చదవండి: ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే వైఎస్సార్‌సీపీదే జయభేరీ

ఒకవైపు టీడీపీలో పెత్తనం చేద్దామని వస్తే.. ఆదిలోనే ఎదురుగాలి మొదలైంది. ఇంకోవైపు తమది పెద్ద రాజకీయ కుటుంబం అని చెప్పుకుంటున్నప్పటికీ అదే కుటుంబం నుంచి సహకారం లేకపోవడంతో ప్రస్తుతం ఆనం పరిస్థితి అయోమయంలో పడిందట. అక్కున చేర్చుకున్న అధికార పార్టీకి దూరమై అసమ్మతితో బయటకు వచ్చిన ఆనం పరిస్థితి ఇప్పుడు ముందు నుయ్యి వెనక గొయ్యి అన్న చందంగా తయారైందని టాక్ నడుస్తోంది.

Videos

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)