Breaking News

‘కాంగ్రెస్ దివాలా.. అందుకే మాకు వద్దు అనుకుంటే వారికి ముద్దయ్యారు’

Published on Tue, 04/25/2023 - 17:06

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంతో విమర్శల జోరు పెంచాయి అధికార, ప్రతిపక్షాలు. మంగళవారం బాగల్‌కోట్‌లో బీజేపీ నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా.. కాంగ్రెస్‌పై విమర్శలతో విరుచుకుపడ్డారు. హస్తం పార్టీ దివాలా తీసిందని, ఆ పార్టీకి నాయకులే కరవయ్యారని ఎద్దేవా చేశారు. అందుకే బీజేపీ రెబల్‌ నాయకులపై ఆధారపడిందని సెటర్లు వేశారు. ఎన్నికలకు ముందు కమలం పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరిన వారికి టికెట్లు ఇస్తున్నారని, ఆ పార్టీ పరిస్థితికి ఇదే నిదర్శనమని ధ్వజమెత్తారు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి సీనియర్లను పక్కనపెట్టింది బీజేపీ. యువ నేతలకు టికెట్లు కేటాయించింది. దీంతో చాలా మంది సీనియర్ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడి కాంగ్రెస్, జేడీఎస్‌లో చేరారు. టికెట్లు ఖరారు చేసుకున్నాకే పార్టీ మారారు. ఈనేపథ్యంలోనే అమిత్‌షా కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు.

కాగా.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను ఒకే విడతలో మే 10న నిర్వహించనున్నారు. 13న కౌంటింగ్, ఫలితాలు ప్రకటిస్తారు. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు 2,613 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయితే ఇటీవల నిర్వహించిన సీఓటర్ సర్వేలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని తెలిపింది. అధికార బీజేపీకి మెజారిటీ రాదని పేర్కొంది. దీంతో కాంగ్రెస్ దృఢ విశ్వాసంతో ముందుకెళ్తోంది. ఈసారి 150 స్థానాలకుపైగా కైవసం చేసుకుంటామని హస్తం పార్టీ నేతలు చెబుతున్నారు.
చదవండి: షిండేకు ఊహించని షాకిచ్చిన బీజేపీ.. సీఎంగా తప్పుకోవాలని హుకుం..?

Videos

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)